– ఎమ్మెల్యే రామానాయుడు
కుప్పంలో అర్థరాత్రి పోలీసులు తనతో పాటు టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పంలో రాత్రి జరిగిన సంఘటన ఒక బ్లాక్ డే అని అన్నారు. అర్ధరాత్రి దాటాక బలవతంగా పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టు చేసి బయటకు గెంటి వేయయడం దారుణమని మండిపడ్డారు. పులివెందల రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయడం, బ్రాంతులకు గురి చేయడం ప్రజలు సహించరన్నారు. సాక్షి దినపత్రిక తనపై అసత్య
ప్రచారాలతో పతాక శీర్షికల్లో వార్తలు రాయడంపై పరువు నష్టం దావా వేసేందుకు కోర్టుకు వెళతామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. కాగా…కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విపక్ష నాయకుల అరెస్టుల పర్వానికి పోలీసులు అర్ధరాత్రి తెరలేపారు. పట్టణంలోని బీసీఎన్ రిసార్ట్స్‌లో బస చేసిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నానీలతో పాటు బయటున్న
ఎమ్మెల్సీ దొరబాబునూ పోలీసులు మంగళవారం రాత్రి 11గంటలకు అరెస్టు చేశారు. అలాగే టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్, ఎమ్మెల్యే రామానాయుడిని కూడా రాత్రి ఒంటి గంటకు అరెస్టు చేసి తరలించారు. ఎన్నికలయ్యేంతవరకు వారు కుప్పంలో కనిపించరాదని, అలా కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి హెచ్చరించారు.