– అన్నాహజారే స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే శుక్రవారం స్పందించారు. ‘నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను. స్వయంకృతాపరాధం వల్లే ఆయన అరెస్టు అయ్యారు’ అని కేజ్రీవాల్‌పై అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్ తన మాట వినలేదన్నారు. ఆయన తన నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సి ఉందన్నారు.