విరుద్ న‌గ‌ర్ నుంచి సినీన‌టి రాధిక పోటీ

చెన్నై: సీనియ‌ర్ న‌టి రాధిక లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌నున్నారు.. త‌మిళ‌ నాడులోని విరుద్ న‌గ‌ర్ నుంచి బిజెపి అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేర‌కు బిజెపి త‌న నాలుగో జాబితాలో ఆమె పేరును ప్ర‌క‌టించింది. లోక్‌సభ అభ్యర్థుల కోసం బీజేపీ నాలుగో జాబితా శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 15 స్థానాలకు, అలాగే.. పుదు చ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది.

ఈ జాబితాలో చిదంబరం ఎస్సీ నియోజకవర్గం నుంచి పీ కార్తికేయిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. కార్తికేయిని 2017లో అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరారు. నటి నుంచి పొలిటీషియ న్‌గా మారిన రాధిక భర్త శరత్‌ కుమార్ త‌న పార్టీ అఖిల ఇండియా సమతువ మక్కల్‌ కల్చి ను, ఈమధ్యే బీజేపీలో విలీనం చేశారు. దీనికి బ‌హమ‌తిగా రాధిక‌కు బిజెపి విరుద్ న‌గ‌ర్ సీటు కేటాయించింది.

Leave a Reply