డ్రగ్స్ వెనుక వైసీపీ పెద్దల హస్తం

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి : జగన్ పాలనలో ఏపీని నాశనం చేశారు. గంజాయి, డ్రగ్ రవాణాలో అగ్రస్థానంలో ఏపీ నిలిచింది – విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‍గా మార్చారు. నిన్న విశాఖలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ కంటెయినర్ తనిఖీ చేయకుండా కొందరు అధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ డ్రగ్స్ కంటెయినర్ ని వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభధ్రరావుకి చెందిన సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వైసీపీ సీనియర్ నేత, ఇతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబందాలున్నాయి.

Leave a Reply