సానా సతీష్ బాబు ప్రజా దర్బార్
కాకినాడ: “సమస్య మీది… పరిష్కారం మాది” అనే నినాదంతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందుతోంది. శుక్రవారం నిర్వహించిన 28వ ప్రజా దర్బార్‌కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల భారీగా తరలివచ్చి బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు,,
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్ లైన్ సమస్యలు వంటి అంశాలకు సంబంధించి అర్జీలు అందజేశారు.
అర్జీలను స్వీకరించిన కార్యాలయ సిబ్బంది వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇన్‌ఛార్జి మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, నూటన్ ఆనంద్, డీఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్, జున్నూరు బాబి, గింజాల శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, ఐటిడిపి పాలిక సతీష్, తదితరులు పాల్గొన్నారు