– బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భరోసా
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం చోడవరం గ్రామంలో తుపాను ప్రభావం తో నష్టం వాటిల్లిన పంట పొలాలు ను బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో నష్టం అంచనాలపై మాధవ్ సమీక్షించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన రీతిలో ఆదుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, తాతినేని శ్రీ రాం ,చిరువోలు బుచ్చి రాజు అడ్డూర శ్రీ రాం, తదితరులు పాల్గొన్నారు.