సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు అరెస్టును ఖండిస్తున్నా

0
14

-అరెస్టుకు ముందు 41ఏ నోటీసుల ఇవ్వాలన్న బుద్ధి సీఐడీకి లేదా.?
-సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ తంగలోతొక్కుతోంది
– అచ్చెన్నాయుడు

సీనియర్ జర్నలిస్ట్ 73 ఏళ్ల వయసు కలిగిన కొల్లు అంకబాబును అరెస్టు చేయడం దుర్మార్గం. జగన్ రెడ్డి సూచనల మేరకు రాత్రి వేల అరెస్టు చేయడం సీఐడీకి అలవాటుగా మారిపోయింది. అరెస్టుకు ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలన్న బుద్ధి సీఐడీ అధికారులకు లేదా.? 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేయాలని ఇప్పటికే అనేకసార్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియలో పోస్టు పెట్టాడని అరెస్టు చేయడం సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన న్యాయస్థానం ఆదేశాలను పక్కనబెట్టి సమాజ విధ్వంసకుడు జగన్ రెడ్డి ఆదేశాలను సీఐడీ పాటించడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి మెప్పుకోసం ఇష్టానుసారంగా సీఐడీ వ్యవహరించడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీఐడీ పోలీసులు చేష్టల వల్ల ఆ వ్యవస్థ పేరుకే మచ్చ వస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అర్థరాత్రిళ్లు అరెస్టు చేయడమేంటి.? అంకబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారని కుటుంబ సభ్యులు అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. వృద్ధాప్యంలో ఉన్నవారిని అరెస్టు చేసి ఏం ఉద్దరిస్తావు జగన్ రెడ్డి.? గతంలో రంగనాయకమ్మ అనే వృద్ధురాలిని కూడా అరెస్టు చేసి పాపం మూటగట్టుకున్నావు. తక్షణమే అంకబాబును విడుదల చేయాలి.