Suryaa.co.in

Andhra Pradesh

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టు అక్రమం

– టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి:-సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వాట్స్ యాప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రం గా తప్పు పట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని చంద్రబాబు అన్నారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది అని చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుబడిన విషయం వాస్తవం కాదా…ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తే తప్పు ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వెంటనే అంకబాబు ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE