Suryaa.co.in

Andhra Pradesh

ఎస్పీ ప్రాతినిద్య నియోజకవర్గాలలోనే దళితులపై దాడులా?

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ఏ మూల చూసినా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయి. ఎస్సీ ప్రాతినిద్య నియోజకవర్గాలలో సైతం ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారు వైసీపీ నాయకులు. నందికొట్కూరులో టిడిపి దళిత నేత శాంతరాజుపై దాడిచేసి అక్రమ కేసు బనాయించడం దుర్మార్గం. సంతనూతలపాడులోని మద్దలకట్ట గ్రామానికి చెందిన తంగిరాల జార్జి, అతని భార్యపై వైసీపీ నేతల దాడి మరువక ముందే నందికొట్కూరులో శాంతరాజుపై దాడికి తెగబడ్డారు. బుక్కరాయ సముద్రంలో దళితుల శ్మశాన వాటికకు కంచె వేసి శవ ఖననాన్ని సైతం అడ్డుకోనే నీచరాజకీయాలకు తెరలేపారు. స్పీకర్ ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సుంకరిపేట గ్రామంలో కూరగాయలు పండించుకుంటూ జీవానోపాధి సాగిస్తున్న ఆరు దళిత కుటుంబాలపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. దళిత మంత్రులుగా ఉండి కూడా దళితులకు న్యాయం చేయలేని చేతగాని మంత్రులను ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాను.
అంబేడ్కర్ రిజర్వేషన్ ఫలాలతో పదవులు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాటి కులస్తులపై దాడులు చేస్తుంటే కనీసం కనికరం చూపని ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం?
శాంత రాజు చేసిన తప్పేంటి. ఆయనపై అక్రమ కేసులు బనాయించి ఎందుకు హింసించాలని చూస్తున్నారు. భూ వివాదం పరిష్కరించాలని అడగటం శాంతరాజు చేసిన తప్పా. శాంతరాజు అక్రమ అరెస్టుపై నిరసన తెలపడానికి వచ్చిన దళిత సంఘాలను సైతం బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు తెగబడ్డారు. జగన్ రెడ్డికి బయపడే మంత్రులు దళితులపై మాత్రం తమ ప్రతాపం చూపడం సిగ్గుచేటు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దాడులు చేస్తున్న వైసీపీ నాయకులకు దళితులే బుద్ది చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయి. దళితులపై దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాట్లాతున్న వైసీపీ నాయకులు ఆ థియరీ తమకు వర్తిస్తుందని గుర్తించుకోవాలి.

LEAVE A RESPONSE