మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు కు చిరు సత్కారం

మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులై తొలిసారిగా విజయవాడ పర్యటనకు విచ్చేసిన డాక్టర్‌ కంభంపాటి హరిబాబును గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా కల్సి, చిరు సత్కారాన్ని అందించారు. గవర్నర్‌గారి స్వస్థలం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో ఐదేళ్లపాటు భాషా ప్రవీణ చదివి ప్రస్తుతం ఆ కళాశాల పూర్వ విధ్యార్ధుల సంఘ గౌరవ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న నిమ్మరాజు ఈ సందర్భంగా ‘‘రాష్ట్రంలోని సంస్కృత కళాశాలలన్నీ ఒక్కటిగా మటుమాయమవుతున్నాయని అన్నారు.
ఈ దేశంలో సంస్కృత భాషాభివృద్ధికై తిమ్మసముద్రంలోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల కేంద్రంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల పూర్వ విధ్యార్ధుల కార్యకలాపాల వివరాలు, ఫోటోలతో కూడిన ఓ పుస్తకాన్ని గవర్నర్‌కు నిమ్మరాజు అందించారు.

Leave a Reply