– భారీ పరిశ్రమలు, ఐటి మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు
రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు మరియు నిర్వాహకులు అయిన రంగరాజన్ గారి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇది హేయమైన చర్య, రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదు.. రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాలపడడం దుర్మార్గం వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించని నేరం అంతే కాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్య
కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది.
ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషం. ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదు.. కఠినంగా వ్యవహరిస్తాం..