**

భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు…

Read More

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్

-ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నాడు? -కంటెయినర్ ఎందుకు వచ్చిందో. సమాధానం చెప్పాలి -నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి -బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారు. లక్ష మంది తో సభ అనుకుంటే.. ముప్పై వేల మంది కూడా రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జనగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పురందేశ్వరి పై వ్యాఖ్యలు చేసిన జగన్…

Read More

88 స్థానాలకు నోటిఫికేషన్

సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Read More

డబ్బులేకే పోటీ చేయట్లేదు

-నిర్మలా సీతారామన్ ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా అన్నారు.

Read More

కాకాని అరాచకాలకు ఫుల్‌ స్టాప్

-మండలాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా! కాకాణి -పదేళ్లు దోచుకుని ఇప్పుడు ప్రమాణాలు చేసి ప్రయోజనం ఏంటి? -కాకాణి అవినీతి,అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్, శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు ప్రజల ఓట్లతో…

Read More

మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి

-టిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు -కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు -కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి -పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హైదరాబాద్ : మల్కాజ్గిరి…

Read More

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎచ్చర్ల : ఈశ్వరరావు విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు అరకు వ్యాలీ : రాజారావు ధర్మవరం : సత్యకుమార్ అనపర్తి : శివకృష్ణ రాజు కైకలూరు : కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి బద్వేలు: బొజ్జ రోషన్ జమ్మలమడుగు…

Read More

వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

ఈడీ సోదాలు విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800…

Read More

ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులే

బిహార్ లోని ఛప్రా పట్టణా నికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.

Read More

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం

-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని…

Read More