Suryaa.co.in

Andhra Pradesh

ఎవరీ గోల్డ్‌మ్యాన్?

( జానకీదేవి)

సెవిరి ,లేక కేజీ కాదు…ఏకంగా 3కేజీలు..వామ్మో..ఒంటినిండా బంగారంతో తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మెన్‌ ఎవరో కాదు ఏపీ లోని గుంటూరు జిల్లా వాసే

పది గ్రాములు కాదు… వంద గ్రాములు కాదు… ఏకంగా మూడువేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లెట్లు… వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్దపెద్ద గోల్డ్‌ చైన్స్‌… మొత్తంగా మూడు కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపై ధగధగ మెరిసిపోతోంది.

గోల్డ్‌మ్యాన్‌ పేరు గడ్డిపాటి సాంబశివరావు, సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి. తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్‌ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు. గోల్డ్‌మ్యాన్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తిచూపించారు. వామ్మో ఇంత బంగారమా అంటూ అవాక్కయ్యారు. నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా బంగారు ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు… తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారూ

తిరుమల శ్రీవారి ఆలయం ముందు గోల్డ్ మెన్ హల్‌చల్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన గడ్డిపాటి సాంబశివరావు అనే భక్తుడు దాదాపు మూడు కిలోలకుపైగా బంగారు నగలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నాడు. తిరుమల ఆలయం ముందు గోల్డ్ మెన్ సాంబశివరావును చూసేందుకు భక్తులు క్యూ కట్టారు. బంగారు నగల అలంకరణతో దర్శనమిచ్చిన సాంబశివరావుతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.

 

LEAVE A RESPONSE