పేదలకు తమ భూములను దానం చేసిన చరిత్ర అయ్యన్న కుటుంబానిది

-జగన్ రెడ్డి కుటుంబంది ఒక కబ్జా కోరు చరిత్ర.
-మంగంపేట బైరటీస్ మైన్స్ యజమాని జింకా వెంకట నరసయ్య నుంచి పల్నాడు జల్లయ్య వరకు -బలహీన వర్గాల వారిని పొట్టనపెట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది
-దళిత మహిళా ఉపాధ్యాయురాలి ఇంటి దారిని కబ్జా చేసి వైసీపీ నాయకుడు అడ్డంగా గోడ కడితే జగన్ రెడ్డి ఏం న్యాయం చేశాడు?
-బడుగు, బలహీన వర్గాల ప్రజలే జగన్ రెడ్డికి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది.
– టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

రాష్ట్రంలో వైసీపీ దురాగతాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు ఎవరిని వదిలిపట్టడం లేదు. కొద్ది నెలలుగా పతనమౌతున్న తన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోలేక, రోజురోజుకు తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాధరణను చూసి ఓర్చుకోలేక జగన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి ఒక సైకోలా తయారయ్యాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్లిన ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో చంద్రబాబు నాయుడికి ప్రజలు విశేష ఆదరాభిమానాలు కనబర్చారు. చోడవరం సభలో చంద్రబాబు నాయుడి కోసం లక్షలాది మంది ప్రజలు రోడ్డుకి రెండు వైపుల చేరి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జగన్ రెడ్డి మూడేళ్ల బాదుడును ప్రజలు తట్టుకోలేక…నీ పరిపాలన ఇక చాలు అంటూ.. వైసీపీ పాలనను అంతమొందిచడానికి తెలుగుదేశం పార్టీకి నీరాచజనాలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్న బీసీ నాయకులను టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. గత మూడేళ్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వ అవినీతిపై. దుర్మార్గాలపై అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. అయ్యన్నపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన మచ్చలేని కుటుంబం.
అయ్యన్న తాత గారు చింతకాయల లచ్చాపాత్రుడు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. 1957 లోనే ఆయన ఎమ్మెల్యే. నర్సీపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి 22 ఎకరాల భూమి దానం చేసిన చరిత్ర అయ్యన్న కుటుంబానిది. నర్సీపట్నం దగ్గరలో అయ్యన్నపాలెం అనే ఒక ఊరే ఆ కుటుంబం పేరుతో ఉంది. ఆ ఊరికి భూములు దానం చేసింది కూడా అయ్యన్న కుటుంబమే. జగన్ రెడ్డి కుటుంబానికి ఒక పైసా దానం చేసిన చరిత్ర లేదు. అయ్యన్నపాత్రుడు 1982 లో అన్న నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు ఎంతో నిబద్దతతో పని చేసిన నాయకుడు. అయ్యన్నపాత్రుడు గారి సతీమణి నర్సీపట్నంలో ఒక కౌన్సులర్. అయినప్పటకీ ఇంటిలో ఒక మహిళ ఉందన్న ఇంగిత జ్జానం లేకుండా అర్ధరాత్రి జేసీబీలను తీసుకొచ్చి ప్రహరీ గోడను కూల్చివేశారు.
జగన్ రెడ్డిది ఒక చీకటి బ్రతుకు. అందుకే జగన్ రెడ్డి అర్ధరాత్రులే ఇంటిపైకి జేసీబీలను పంపాడు. ఇంటిలో మహిళలు ఉన్న సంధర్బంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అయ్యన్నపాత్రుడు ఇంటిపైకి ఏ విధంగా పోలీసు బలగాలను పంపాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి నిశాచరలా జీవిలా.. ఒక పిల్లిలా జగన్ రెడ్డి మారిపోయాడు.

అయ్యన్నపాత్రుడు ఏం తప్పు చేశాడని జేసీబీలు, పోలీసులను పంపుతారు? 2019 లో వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి జగన్ రెడ్డికి తెలియదా? వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ స్థలాన్ని ఆక్రమించికుని గోడ కట్టారని చెబుతున్న జగన్ రెడ్డి వాళ్లు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లో అక్రమ నిర్మాణం చేశారని జగన్ రెడ్డి చూపించగలడా? నిజంగా ఆక్రమణ జరిగితే నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా అర్ధరాత్రి నోటీసు గోడకు అంటించి ఎందుకు కూల్చారు? జగన్ రెడ్డి గోడకు అంటించిన నోటీసులో ఆక్రమణకు గురైన స్థలం 0.2 సెంట్లు అని ఉంది. అంటే ఇది కనీసం 10 గజాలు కూడా కాదు. 10 గజాల స్థలం కోసం జేసీబీలు, వందల మంది పోలీసులు, అధికారులను జగన్ రెడ్డి పంపాడు. ప్రజల పక్షాన పోరాడుతున్న అయ్యన్న పాత్రుడి గొంతు నొక్కాలని కేవలం కక్షసాధింపు చర్యలతో అయ్యన్నపాత్రుడి ఇంటిపైకి వెళ్లారు.

జగన్ రెడ్డి బ్రతుకే ఒక నీచ చరిత్ర. ఒక కబ్జా చరిత్ర. జగన్ రెడ్డి తాత రాజరెడ్డి ప్రస్తానం ఒక కబ్జాతోనే మొదలైంది. జింకా వెంకటనరసయ్య అనే ఒక చేనేత కులానికి చెందిన బడుగుల వర్గాల వ్యక్తిని హత్య చేసి మంగంపేటలోని బైరటీస్ గనులను కబ్జా చేశాడు. ఒక బీసీ కుటుంబాన్ని పొట్టనబెట్టుకునే జగన్ రెడ్డి కుటుంబం ప్రస్తానం మొదలైంది. ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇడుపులపాయ ఎస్టేట్ లో దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను కబ్జా చేశారు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఇంటికి ప్రక్కనున్న చెరువుని ఆక్రమించుకున్నారు. తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకుని దాన్ని క్రమబద్దీకరించుకున్నారు.

మంగంపేట జింకా వెంకట నరసయ్య దగ్గర నుంచి పల్నాడులో ఇటీవల వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన జల్లయ్య వరకు బలహీన వర్గాల నాయకులను హత్యలు చేసి వారి శవాలపై నడుచుకుంటూ వచ్చిన చరిత్ర జగన్ రెడ్డి కుటుంబంది. నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లా, మార్టూరుకు చెందిన ఒక దళిత మహిళా ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకుని వైసీపీ నాయకుడు అడ్డంగా గోడ కట్టాడు. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రకాశం జిల్లా నుంచి వందల కిలో మీటర్లు వీల్ చైర్ లో తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి న్యాయం చేయమని అడిగితే జగన్ రెడ్డి ఏం న్యాయం చేశాడు? కబ్జాలు, ఆక్రమణల గురించి జగన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. కనీసం దళిత మహిళా ఉపాధ్యాయురాలి ముఖం కూడా జగన్ రెడ్డి చూడలేదు. ఒక దళిత మహిళా ఉపాధ్యాయురాలికి న్యాయం చేయలేని జగన్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగే అర్హత లేదు.

పోలీసు వ్యవస్థ అంటే వైసీపీ నాయకుల చేతిలో ఉండే కర్రకాదు. వందల కోట్ల అవినీతి జరిగిందని నాగబాబు అనే ఒక సాప్ట్ వేర్ ఇంజనీరు చెబితే….ఓయ్ సీ.ఐ ఇతన్ని అరెస్టు చెయ్ అని కొబ్బరి చిప్పలమంత్రి వెల్లంపల్లి బెదిరింపులకు దిగాడు. దీనికా పోలీసులు ఉంది. పోలీసులు ఉంది ప్రజలకు రక్షణ కల్పించడానికా లేకా వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగడానికా? ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా? దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. పోలీసులు వాస్తవాలు తెలుసుకుని న్యాయబద్దంగా, ధర్మబద్దంగా వ్యవహరించాలి.

జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు టిడిపి నాయకులు బయపడే ప్రసక్తే లేదు. జగన్ రెడ్డి తన కాకీలను అడ్డుపెట్టుకుని అయ్యన్నను టచ్ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి వేలాదిమంది ప్రజలు అయ్యన్నకు సంఘీభావంగా వస్తారు. అయ్యన్నను టచ్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే పోలీసు బలగాలు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రావాలి. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డి ఒక పిల్లిలా తలుపులు మూసుకుని కూర్చున్నాడు.

వెయ్యి మంది పోలీసులు ఉంటే గానీ బయటకు రాలేని జగన్ రెడ్డి నేడు బలహీన వర్గాల నాయకులను టార్గెట్ చేస్తున్నాడు. ఇదే బలహీన వర్గాల నాయకులు తనకు, తన పార్టీకి సమాధి కడుతారని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అన్ని రోజులు ఒకలా ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ నాయకత్వంలో చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది. రేపటి రోజున జగన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ప్రతిచర్యకు సిద్దంగా ఉండాలి.

నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జగన్ రెడ్డిలా అర్ధరాత్రుల్లో జేసీబీలతో అన్యయంగా ఎవరిపైకి వెళ్లలేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వమ్య విలువలకు, రాజ్యాంగబద్ద పాలనకు కట్టుబడి పాలన చేసింది. రాజారెడ్డి రాజ్యాంగంలా ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి గానీ..వారిపై విరుకుడి దాడులు చేయడం మంచి పద్దతి కాదు.

అయ్యన్న కుటుంబం అన్ని అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేశారు. జగన్ రెడ్డి నక్కజిత్తుల వ్యవహారాలు మానుకోవాలి. జగన్ రెడ్డి కాకీలకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయపడరని గుర్తెరగాలి. రాబోయే రోజుల్లో కూడా జగన్ రెడ్డి కబ్జాకోరు చరిత్రను ప్రజలకు వివరించి చెబుతాం. జగన్ రెడ్డి పద్దతి మర్చుకునే వరకు మా పోరాటం కొనసాగిస్తాం.

Leave a Reply