ధ‌ర్మ‌వ‌రం క‌బ్జాల్లో అబ్బాయి కేటు..తాడిప‌త్రి దోపిడీల్లో బాబాయ్ సెప‌’రేటు’

Spread the love

-యువ‌గ‌ళం పాద‌యాత్ర నుంచి నారా లోకేష్‌

యువగళం పాదయాత్రలో అబ్బాయ్ ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేటు క‌బ్జాలు చూశాం. తాడిప‌త్రి వ‌చ్చాం. అబ్బాయి ఏక్ నంబ‌ర్ సెటిల్మెంట్లు అయితే, ఇక్క‌డ బాబాయ్ ద‌శ్ నంబ‌ర్ దందా. అబ్బాయి కేతిరెడ్డి కేటు అయితే బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో సెప‌`రేటు’. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ వద్ద సెల్ఫీ దిగాను. ఇసుక తవ్వకాలకు10 ఎకరాలు కేటాయిస్తే, అంతకంటే ఎన్నో రెట్ల అధిక విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరిపి బాబాయ్ గ్యాంగ్ కోట్లు దండుకుంటోంది. ఈ విషయం మీద పోరాటం చేసిన మాజీ ఎమ్యెల్యే జెసీ ప్రభాకర రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి హింసించారు. ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది ఈ ముఠా. ధర్మవరం లో అబ్బాయ్ ఇసుక దోపిడిలో అడ్డంగా దొరికిపోవడంతో బాబాయ్ పెద్దారెడ్డి కాస్త జాగ్రత్త పడ్డాడు. నా పాదయాత్ర అటుగా వెళ్తుంది అని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసి దుకాణం సర్దేసాడు. కానీ చేసిన ప్రకృతి విధ్వంసం ఎక్కడికి పోతుంది? ఇవిగో గుడ్ మార్నింగ్ కేటు బాబాయ్ ఇసుక మాఫియాకి సంబంధించిన ఆధారాలు

Leave a Reply