– కూటమి వైఫల్యాలపై జనంలోకి వెళ్లండి
– పుసక్త ఆవిష్కరణలో వైసీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు
విజయవాడ: జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ , నియోజక వర్గ కార్పోరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు సింగ్ నగర్ లోని ఆయన కార్యాలయం లో ఆవిష్కరణ చేశారు.
ఈ పుస్తకం ద్వారా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలు కానీ ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసిన పరిపాలన అంత కూడా క్రోడీకరించి ఈ ప్రభుత్వం లో పొందుపరిచామని మల్లాది విష్ణు అన్నారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేస్తున్నట్లున్న అప్రజాస్వామ్య పాలన ఇదంతా కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ పరిపాలన గురించి తెలియాలని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పాలని ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో అనేక హామీలతో పాటుగా అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి వాగ్దాన భంగం చేసి, అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్లపాటు తిట్టి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో కలిసిన ప్రజలందరి అభిప్రాయాలు, ప్రజల అవసరాలు పరిశీలించి సంక్షేమ కార్యక్రమాల రూపంలో తీసుకొని ఆయన నవరత్నాలను రూపొందించి, మంచి పరిపాలనను గత ఐదు సంవత్సరాలు అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం లో 30 లక్షల మందికి లబ్దిదారులకి ఎగ్గొట్టారు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయని అన్నారు.
ఈరోజు వైజాగ్ లో పిల్లలందరూ కూడా సరైన టీచర్లు లేరని ధర్నా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 20 లక్షల మందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి చూశామని, టిడిపి ప్రభుత్వం ఈ రోజు 10 లక్షల మంది కూడా ఫీజు నెంబర్స్ మెంట్ చేయలేకపోతున్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం 2014-19 సమయంలో అధికారం లో ఉన్నపుడు చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయి వైయస్ జగన్ తీర్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ 6600 కోట్లు బకాయిలు చేసిందని వాటి మీద శ్వేత పత్రం వదలాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు చార్జీలు పెంచమని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ప్రజల మీద కరెంట్ చార్జీల భారం 15 వేల కోట్ల రూపాయలు వేసారని, దీన్ని ఎవరు ప్రశ్నిస్తే వారి పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.
శాతవాహన కళాశాల 500 కోట్ల రూపాయలు ఆస్తులని తెలుగుదేశం పార్టీ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అలాగే తెలుగుదేశం లో ఉన్నటువంటి మరొక సమూహం కలిసి హస్తగతం చేసుకోవాలని రాత్రికి రాత్రి కుల్చేయడం జరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కళాశాల స్థలం ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నామని ఇప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం దానిమీద మాట్లాడిన పరిస్థితి లేనేలేదని, ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రభుత్వం కళ్ళు చెవులు మూసుకుందా? అని ప్రశ్నించారు.
ఈ రోజు తిరుచానూరులో కూలగొట్టి పక్కనే ఉన్న విగ్రహాలని నదిలో పడేస్తే దానిమీద ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. పైగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో జరిగినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అదే నియోజకవర్గంలో ఇంకొక గుడిని కూడా తెలుగుదేశం వాళ్లే కొలగొట్టేస్తే వాళ్ల మీద ఎటువంటి చర్యలు లేవని దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు? చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైయస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కి డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. 13 వేలు తల్లుల ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలు కావాల్సిన మౌలిక సదుపాయాలు పై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడని అన్నారు.
నియోజక వర్గ కార్పొరేటర్లు కుక్కల అనిత, కొండైగుంట మల్లేశ్వరి, ఇసరపు దేవి, షాహిన సుల్తనా, యర్రగోర్ల తిరుపతమ్మ, సర్వాణి మూర్తి, ఆలంపూరు విజయ్, సుందర్ పాల్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, మైనారిటీ విభాగం ఉపాధ్యక్ష్యులు SD బాబు, కార్యదర్శి అక్బర్, BC రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి విజయ లక్ష్మి, సీత రామ్, రామి రెడ్డి, బాలచంద్ర రావు, గజ్జలకొండ వాసు, క్లస్టర్ అధ్యక్ష్యులు పిల్లుట్ల వంశీ, నియోజకవర్గ నాయకులు వరలక్ష్మి, రఫీ, యక్కల శంకర్, నందేపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.