కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు. కూటమి ఏడాదిలోనే ఇవ్వన్నీ చేస్తే.. గత 5 ఏళ్లలో కూడా ఇన్ని చేయలేదు అనుభవం ఉన్న చంద్రబాబు కి అనుభవం లేని అసమర్థత జగన్ కి ఉన్న తేడా ఇదే.
– పింఛన్ల పెంపు.. నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ. ఏడాదిలో చేసిన ఖర్చు రూ. 34 వేల కోట్లు.
– 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి… మొదటి సంతకం హామీ నెరవేర్చిన ప్రభుత్వం
– దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితం. ఇప్పటికి కోటి సిలిండర్లు డెలివరీ. ఈ పథకం కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ఖర్చు.
– గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు.
– అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం. ఇప్పటికి రూ.1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కి.మీ రోడ్లు బాగు చేసిన ప్రభుత్వం
– మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు. మత్య్సకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం కింద రూ. 259 కోట్లు ఇప్పటికే అందజేత.
– 203 అన్న క్యాంటీన్లు. మరో 61 అన్నా క్యాంటీన్ లు సిద్దం. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదానం
– చెత్త పన్ను రద్దు. పేరుకుపోయిన 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలిగింపు
– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.
– దీని కోసం 8,50,342 మంది రైతులకు రూ.13,584 కోట్లు చెల్లింపు. ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1674 కోట్లు కూడా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చెల్లించిన కూటమి.
– కూటమి ప్రభుత్వంలో రూ.990 కోట్లు పంచాయతీల్లో అభివృద్ది పనులకు కేటాయింపు.
– రూ.4500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు – 30 వేల పనులకు శ్రీకారం.
– రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు. 78 ప్రాజెక్టుల ద్వారా రూ.9.20 లక్షల కోట్ల పెట్టుబడులు వీటితో 5.70 లక్షల ఉద్యోగాలకు అవకాశం.
– అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కు శంకుస్థాపన
– శ్రీ సిటీలో రూ. 5000 కోట్లతో ఎల్ జి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ
– రూ. 65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు.
– అమరావతికి కేంద్రం ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం
– పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12500 కోట్లు విడుదల
– స్టీల్ ప్లాంట్ కు రూ.11,400 కోట్లు కేంద్ర ప్యాకేజ్
– ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయింపు
– విశాఖకు రైల్వే జోన్ మంజూరు. నిర్మాణ పనులు ప్రారంభం
– అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అవగాహణ
– రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో బిసిసిఎల్ రిఫైనరీ కి ఒప్పందం
– 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం…ఇప్పటికి 42 చోట్ల పనులు ప్రారంభం
– ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతం
– రైతులకు మళ్లీ 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభం
– కొత్త మద్యం విధానం ద్వారా జె బ్రాండ్లకు చెల్లు.. నాణ్యమైన మద్యం
– వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం
– హంద్రీనీవా కాలువ విస్తరణ కు ఒకే ఏడాదిలో రూ. 3800 కోట్ల ఖర్చు
– 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలు పునరుద్ధరణ.
– మొన్నటి బడ్జెట్ లో బీసీల కోసం రూ.47,456 కోట్లు కేటాయింపు.
– దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంపు
– చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత. పవర్ లూమ్స్క 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్
– గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
– స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు.
– సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలో వాట్లకు గాను మొత్తం రూ.98 వేలు సబ్సిడీ
– పిఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
– వేద విద్యార్థులకు రూ.3 వేల భృతి, అర్చకుల జీతాలు రూ.15 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు, పాస్టర్లకు రూ.5 వేలు, జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనాలు
– అధికారికంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణదినం.
– అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మారకం నిర్మిస్తాం.
– టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేశాం. యాప్ ల భారం తొలగింపు.
– పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవ్ల సొమ్ము విడుదల.
– ఉద్యోగులకు ఏడాది కాలంలో రూ.7500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల
– అంగన్వాడీలు, ఆశాలకు రూ.1.5 లక్షల మేర లబ్ది చేకూరేలా గ్రాట్యుటీ అమలు .
– మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు. డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం ఏర్పాటు
– నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు
– లక్ష మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ.
– రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు
– విశాఖలో టిసిఎస్ తో ఒప్పందం. భూముల కేటాయింపు.
– అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూముల కేటాయింపు.
– రూ.72 వేల కోట్ల హైవే ప్రాజెక్టులు…రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి
– రూ.2245 కోట్లతో అమరావతికి 57 కి.మీ రైల్వే లైన్ మంజూరు.
– తల్లికి వందనం, అమలు
– అన్నదాత సుఖీభవ పథకాన్ని జులై నెలలోనే ఇస్తున్నాం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం.