-
తిరుమల లడ్డు ఆరోపణలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
-
జగన్‌కు అందరి బీజేపీ సాయం
-
మాజీలంతా జనసేనలోకి క్యూలు
-
ముగ్గురూ కలసి తొక్కేస్తున్నారా?
( రమణ, మచిలీపట్నం)
జగన్ కు తెలుస్తుందో లేదో… చంద్రబాబు చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వైసీపీ నుంచి పది మంది మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, ఇప్పటికే ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.
రాజ్యసభ ఎంపీలకు గురి పెట్టారు, ఇద్దరు రాజీనామా చేసారు, మండలిలో కంట్రోల్ చేసేసారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ రెడీ అవుతుంది. వైసీపీ నుంచి చాలా మంది బయటకు రావడానికి రెడీ అయ్యారు.
కేతిరెడ్డి కూడా వచ్చేస్తున్నాడు, నెల్లూరు వైసీపీ మొత్తం ఖాళీఅయిపోయింది. ఒంగోలు ఖాళీ అయిపోయింది. టీడీపీకి గేట్లు మూశారు గాని జనసేన గేట్లు తెరిచారు, వైసీపీ జెండాను చింపి పంచుకుంటున్నారు. ప్రభుత్వంలో పవన్ జోక్యం తక్కువ, పార్టీ బలోపేతం మీద, తన శాఖల మీద మాత్రమే దృష్టి పెట్టాడు.
తిరుపతి లడ్డూ వివాదంలో చంద్రబాబు చాలా పక్కాగా దెబ్బ కొట్టారు. మత రాజకీయం మొదటిసారి చేశారు. రిపోర్టు బయటకు వచ్చాక వైసీపీ మాట పడిపోయింది. వైవీ సుబ్బారెడ్డి రెచ్చిపోయాక విజిలెన్స్ నోటీసు ఇచ్చింది. అది వైసీపీని భూస్థాపితం చేసినా ఆశ్చర్యం లేదు. తిరుమల వెళ్ళే ప్రతీ ఒక్కరు తిడుతున్నారు.వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది, అందుకే వైవీ, భూమన ఇద్దరూ బయటకు వచ్చారు.
టీటీడీ రిపోర్ట్ బయట పెట్టింది సాక్ష్యాలతో సహా… జగన్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజ్యసభలో బలం ఉంటే బిజెపితో కలవచ్చు గాని అది సాధ్యం కావట్లేదు. బిజెపి చంద్రబాబుకి చాలా దగ్గరైంది. అసలు ఏ కోణంలో కూడా విమర్శలు చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. నందిగం సురేష్ ఏది బయట పెట్టినా జగన్ కు సమస్యే. నందిగం సురేష్ ఇప్పట్లో బయటకు రావడం కష్టమే. వచ్చినా యాక్టివ్ గా ఉండే ఛాన్స్ లేదు.
చంద్రబాబు స్పీచ్ లు కూడా జగన్ కు అర్ధం కావట్లేదు, మాటలు గతంలో మాదిరి అయితే లేవు. లోకేష్ జోక్యం ఉన్నా, ప్రభుత్వంలో అది బయటకు రావట్లేదు, విమర్శలు చేసే ఛాన్స్ దొరకట్లేదు.
పొత్తు లో ఉన్న పార్టీలు చంద్రబాబు మాటే వింటున్నాయి. బీజేపీలో జగన్ గ్యాంగ్‌ని తొక్కేసారు. వైసీపీ నుంచి బీజేపీకి ఎవరిని వెళ్ళనీయట్లేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టాక.. వైసీపీ ట్రోల్ చేసే ఛాన్స్ లేకుండా, నిర్మలా సీతారామన్‌తో ప్రెస్ మీట్ తెలుగులో పెట్టించారు.
జగన్ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోద్ది చూస్తూ ఉండండి. కలిసి తోక్కేస్తున్నారు.