Suryaa.co.in

Devotional

బహుదేవతాకం రామతారకం

సత్యవాక్కు పాలకుడు
సకలజనుల ప్రేమికుడు.
శ్రీరాముడె ధర్మానికి
యుగయుగాల వారసుడు

ఏ నామమైనా పలికితే ఆ నామం దేవుడు మాత్రమే పలుకుతాడు
అదే శ్రీ రామ నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు
రామ అంటే రాముడు పలుకుతాడు
ఆ నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి నిలిచేవాడు హనుమంతుడు.

శ్రీరామలో
శ్రీ అంటే లక్ష్మి
రా అంటే విష్ణువు (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)
మ అంటే శివుడు (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)
శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అని అడిగింది. ఈ అవతారంలో హనుమ బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదని శివుడు అన్నాడు.

అయితే హనుమ వాలంగా ఉంటాను అని హనుమంతుడి తోకలోకి ప్రవేశించింది పార్వతి. అందుకే తోక హనుమకు ఆయుధంగా బాగా ఉపయోగపడింది.

కనుక హనుమ వస్తే ఆసనతోటే పార్వతీ కూడా వచ్చినట్లే కదా. కనుక రామా అంటే ఆరుగురు దేవతలు (రాముడు, హనుమ, లక్ష్మీనారాయణులు శివపార్వతులు) స్పందిస్తారు..ఆశీర్వదిస్తారు.

– డాక్టర్ రామకృష్ణ

LEAVE A RESPONSE