– 23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అత్యాచారం హేయం…నీచం…
– స్టేషన్కు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నా, పోలీసులు నిర్లక్ష్యం వహించటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా ?
-నిందితులను అరెస్ట్ చేయండి అంటే మహిళలను అరెస్ట్ చేస్తారా?
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి తక్షణం తప్పుకోవాలి
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్
విజయవాడలో 23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు చేసిన సామూహిక అత్యాచారం హేయమైన,నీచమైన చర్య అని, మూడేళ్లలోనే వైకాపా ప్రభుత్వం ఏపీని అత్యాచారాల ఏపీగా మార్చేసిందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ , స్టేషన్కు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నా, పోలీసులు స్పందించక పోవటం, ప్రభుత్వం సగర్వంగా చెబుతున్న 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళకు ఆనవాళ్ళా? అని ప్రశ్నించారు.
స్టేషన్ కు వెళ్ళి నా న్యాయం జరగకపోతే, ఇక దిశ యాప్ దేనికి అని అన్నారు. రోజుకో అత్యాచారం, రోజుకో ఆత్మహత్య, రోజుకో బహుజన కులాలపై దాడి చూడాల్సి వస్తుందని, సిఎం కాన్వాయ్ కోసం యాత్రికుల కారును తీసుకెళ్ళటం వంటి అరాచకాలకు కూడా సిఎం సార్ బటన్ నొక్కి స్వాగతిస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ క్షణ కాలం పదవిలో కొనసాగే అర్హత లేదని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఛైర్పర్సన్ బాధ్యతను మహిళలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కి బాలకోటయ్య సూచించారు.