కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్ , నాడు-నేడు పథకానికి వేలకోట్లు ఇస్తాడా?

– జగన్ రెడ్డిదోపిడీ, అవినీతితో రాష్ట్రంలో ఆర్థిక అత్యవసరస్థితి ప్రకటించాల్సిన సమయం వచ్చింది
• అంగన్ వాడీల్లోని చిన్నారులకోసం కోడిగుడ్లు సరఫరాచేసేవారికి రూ.130కోట్లు ఇవ్వలేని జగన్ రెడ్డి, సాక్షి దినపత్రికకు మాత్రంరూ.400కోట్లు దోచిపెట్టాడు
• ఏపీకేంద్రంగా దుర్వినియోగమవుతున్న లక్షలకోట్ల ప్రజలసొమ్ము ఎటుపోతోందో కేంద్రప్రభుత్వం తేల్చాలి. ముఖ్యమంత్రి సహా, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేల కదలికలపై నిఘాపెట్టాలి
– మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి

న్యాయస్థానాలిచ్చిన తీర్పులను తప్పుపడుతూ, ప్రభుత్వం కోర్టుల్లో వేస్తున్న కోర్టుధిక్కరణ నోటీసులు గానీ, వివిధశాఖలకు చెందిన ప్రభుత్వాధికారులు చేతులుకట్టుకొని న్యాయస్థానాల్లో నిలబడటం చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తేల్చి చెప్పారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాలకులతప్పిదాలకు సంజాయిషీ ఇచ్చుకునేక్రమంలోకోర్టులో చేతులుకట్టుకొని నిలబడితే, ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇది వరకు నీలంసహానీ, డీజీపీ సవాంగ్ న్యాయస్థానంలో నిలబడి క్షమాపణచెప్పారంటే అందుకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రికాదా? ఎన్ఆర్ఈ జీఎస్ బిల్లులు క్లియర్ చేయకుండా, దాదాపు రూ.100 0కోట్ల వరకు పెండింగ్ పెట్టిన ఈ ప్రభుత్వం, న్యాయస్థానాల ఆదే శాలనుకూడా తుంగలోతొక్కుతోంది. గ్రామాల్లో ఇదివరకు ఎన్ ఆర్ ఈజీఎస్ కింద వివిధరకాల అభివృద్ధిపనులుచేసిన వారంతా, ఈప్రభుత్వం బిల్లులుచెల్లించకపోవడంతో నానా అగచాట్లుపడుతు న్నారు. కొందరైతే అప్పులభారంతోప్రాణాలుకూడా తీసుకున్నారు.

ఆ విధంగా చనిపోయినవారిమరణాలన్నీ ప్రభుత్వహత్యలే. ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో నీరు-చెట్టు పథకం కింద, గతంలో చేసినపనులకు సంబంధించి ఈప్రభుత్వం రూ.1268కోట్లవరకు బకాయిలు పెట్టింది. దానిపైకోర్టులు హెచ్చరించాక ఆదరబాదరాగా ప్రభుత్వం నిధులవిడుదలకు ఆదేశించింది.

ఆఖరికి ఈప్రభుత్వం విద్యార్థులతాలూకా భోజనం బిల్లులనుకూడా చెల్లించడంలేదు. మద్యంఅమ్మకాలు, ఇసుకదోపిడీతో ముఖ్యమం త్రి కడుపునిండితే చాలా? పేదవిద్యార్థుల కడుపు నిండాల్సిన పని లేదా? ఇదివరకు ఎక్కడైనా ప్రభుత్వాలుకాంట్రాక్టర్లను, కాంట్రాక్టు లు చేపట్టే సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టేవి. కానీ ఇప్పుడు కాంట్రా క్టర్లే జగన్ రెడ్డిప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ విభాగంవారు ఈ రాష్ట్రానికి ఎ లాంటి వైద్యపరికరాలు సరఫరాచేయడానికి వీల్లేదని, ముందుగా డబ్బులు చెల్లిస్తేతప్పపరికరాలు సరఫరాచేయొద్దంటూ నోటీసులు ఇచ్చారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా?

రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఎక్కడున్నారో అడ్రస్ లేరు. కోవిడ్ తాలూకా నిధులు కూడా వైద్య విభాగాలకు అందించకపోతే వారేంచేయాలి? మందులు, ఇతర వైద్యపరికరాలు ప్రభుత్వాసుపత్రులకు సరఫరాచేస్తే, వారికి సకా లంలో డబ్బులు ఇవ్వలేని దుస్థితిలో ఈప్రభుత్వంఉంది.

గతంలో ఏప్రభుత్వఅధికారి అయినా రిటైర్ అయి వెళ్తుంటే, చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదరుఅధికారిని ఘనంగాసన్మానించి, అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందించి పంపించేవారు. కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రంలో రిటైరయ్యే ఉద్యోగులకుకూడా వారితాలూకా బెనిఫిట్స్ అందడంలేదు.

రిటై రయ్యే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వలేని ప్రభుత్వం నాడు-నేడు కిందవేలకోట్లు ఎలాచెల్లిస్తుందని స్వయంగా న్యాయ స్థానమే ప్రశ్నించింది. న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఇంతగా తప్పుపడుతున్నాకూడా ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నాడు.

ఆఖరికి అంగన్ వాడీకేంద్రాలకు కోడిగుడ్లు సరఫరాచేసే కాంట్రాక్ట్ సంస్థకు కూడా ఈ ముఖ్యమంత్రి డబ్బులు చెల్లించకపోవడంతో చిన్నారులు పౌష్టికాహారలేమితో బాధపడుతున్నారు. ఈ విధంగా ప్రజాసంక్షేమానికి, విద్యార్థులఆకలికి నిధులుఇవ్వడానికి డబ్బు లేవంటున్న ముఖ్యమంత్రి, తనసోకులు, తనతాడేపల్లి హంగులకు పార్టీరంగులు వేయడానికి వేలకోట్లను దుర్వినియోగంచేశాడు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, శ్మశానాలకు వైసీపీరంగులే సి, కోర్టుఆదేశాలతో తొలగించారు. దానికోసం రూ.3వేలకోట్ల వరకు జగన్ రెడ్డి దుబారాచేశాడు. ప్రభుత్వాసుపత్రులకు మందులు, ఇతరత్రా వైద్యపరికరాలు సరఫరాచేసే సంస్థలకు డబ్బులు ఇవ్వక పోతే, దానివల్ల ప్రజల ఆరోగ్యం నాశనంకాదా? ప్రజారోగ్యాన్ని కాపా డలేని ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రేనా?

గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికమై రైతులవ్యవసాయ మోటార్లు కాలిపోతున్నా ముఖ్యమంత్రి స్పందించడు. అంగన్ వాడీకేంద్రాల కు గుడ్లుసరఫరాచేసేవారికి రూ.130కోట్లు చెల్లించలేని జగన్ రెడ్డి, తనసాక్షిపత్రికకు మాత్రం ప్రకటనలరూపంలోరూ.400కోట్లు దోచి పెట్టాడు. డంబాచారాలతో డబ్బాలుకొట్టుకోవడం చేతనైన ముఖ్య మంత్రికి ప్రజల అవస్థలు, విద్యార్థుల ఆకలికేకలు ఏం తెలుస్తాయి?
ఆకాశంలో తిరిగే ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని రోడ్లుఎలాఉన్నాయో ఎలా తెలుస్తుంది? గాల్లోచక్కర్లుకొట్టడం మానేసి, ప్రజల్లోకి వెళితే వారికష్టాలు, బాధలుజగన్ రెడ్డికి తెలుస్తాయి. చంద్రబాబుగారు గ్రామాలను మండలకేంద్రాలకు అనుసంధానిస్తూ ఐడీబీనుంచి తీసుకొచ్చిన రూ.6000కోట్ల రుణాన్నికూడా ఈముఖ్యమంత్రి కాజేశాడు.

విశాఖపట్నం నగరపాలక సంస్థకుచెందిన రూ.400కోట్లను కూడా ముఖ్యమంత్రి దారిమళ్లించాడు. 15వ ఆర్థికసంఘం పంచాయతీలకు ఇచ్చిననిధుల్ని కూడా, సర్పంచ్ లకే తెలియకుండా స్వాహాచేసేశాడు. ఇలాచెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.

ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రంలోచేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యం. కోర్టులముందుచేతులు కట్టుకొని నిలబడి, ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులకు అధికారులుసంజాయిషీ ఇచ్చుకుంటున్నా రు. ఆర్థికక్రమశిక్షణతెలియని ముఖ్యమంత్రిని వెంటనే కేంద్రమే కట్ట డిచేయాలి. ప్రభుత్వసొమ్ముని, ప్రజలసొమ్ముని తనస్వార్థానికి వాడుకుంటూరాష్ట్రాన్ని చిన్నాభిన్నంచేసిన జగన్మోహన్ రెడ్డి ఆర్థిక దుబారాపై కేంద్రఆర్థికసంస్థలు నిఘాపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో వెంటనే ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించాలి. కేంద్రప్రభుత్వం వివిధపథకాలకు, కాంట్రాక్టర్ల చెల్లింపులకు ఇచ్చిన నిధులను ఈ ముఖ్యమంత్రి తనవ్యక్తిగత స్వార్థాలకు, ఇతరత్రా అవసరాలకు మళ్లించాడు. దానిపైకూడా కేంద్రప్రభుత్వం దృష్టి సారించి,ఆ నిధులు ఎటుపోయోయో తేల్చాలి.

చంద్రబాబు హాయాంలోఅన్నిరంగాల్లో రాష్ట్రం ఇతరరాష్ట్రాలతోపోటీపడితే, ఇప్పుడు జగన్ రెడ్డిహాయాంలో అంధకారాంధ్రప్రదేశ్, అరాచకాంధ్ర ప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది.ఇదీ ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డిసాధించిన ప్రగతి. దేశజీడీపీలో ఏపీ రాష్ట్రంకూడా భాగస్వామేనని కేంద్రప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసరస్థితితోపాటు, ఆరోగ్యఅత్యవసరపరిస్థితినికూడా విధించా ల్సిన దుస్థితివచ్చింది. కోర్టులు తిడితేనే ప్రభుత్వశాఖల ప్రధానాధి కారులు జీవోలు ఇస్తున్నారు. అసలు బిడ్డ తాడేపల్లి ప్యాలెస్ లో దర్జాలు ఒలకబోస్తుంటే, పసిబిడ్డలు అంగన్ వాడీల్లో అర్థాకలితో విలపిస్తున్నారని కేంద్రమంత్ర నిర్మలాసీతారామన్ గుర్తించాలి.

రాష్ట్రప్రభుత్వం ఏఏ విభాగాలు, ఎందరుకాంట్రాక్టర్లకు బకాయిలు ఉందో అవన్నీ చెల్లించేశాకే, ముఖ్యమంత్రి బటన్లునొక్కే కార్యక్రమా లు పెట్టుకుంటే మంచిది. తనగొప్పలు ప్రచారార్భాటంకోసం ముఖ్య మంత్రి వాలంటీర్ వ్యవస్థనుపెంచి పోషిస్తున్నాడు. నిన్నటికి నిన్న మహిళాదినోత్సవసభలోకూడా వైసీపీఎమ్మెల్యే రోజా, ఇతరనేతలు ముఖ్యమంత్రికి డబ్బాలుకొట్టారు.ప్రజలసొమ్ముతో ఎంతకాలం డబ్బాలుకొట్టుకుంటారో చూస్తాం. అప్పలు, గొప్పలతో రాష్ట్రానికి, ప్రజలకు తిప్పలు తీసుకొచ్చిన ఈముఖ్యమంత్రి మాటలునమ్మి ప్రజలెవరూ మోసపోకూడదని కోరుతున్నాం.

Leave a Reply