Suryaa.co.in

Telangana

నిరసనకారులు అడ్డుకున్న దాని వెనుక మహా కుట్ర

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్

పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్న దాని వెనుక మహా కుట్ర ఉంది. ఇది అనుకోకుండా జరిగింది కానేకాదు.అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. చైతన్యపురిలో బీజేపీ ఎస్సీ మోర్చా నిర్వహించిన “మౌన ధర్నా”లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ ఏమన్నారంటే…

ఎందుకంటే ప్రధాని పర్యటన వివరాలు, గైడ్ లైన్సును డిసెంబర్ 30 నాడే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పంజాబ్ డీజీపీకి పంపించారు. ప్రధాని పర్యటన రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ నివేదించింది. ఆరోజు వాతావరణం అనుకూలంగా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా ఫిరోజ్

పూర్ వెళతారని… తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఎస్పీజీ నుండి ‘ప్లాన్-బి’ సమాచారాన్ని కూడా పంపింది. కానీ పంజాబ్ సీఎం, డీజీపీలు తమకు సమాచారం లేకుండా ప్రధాని అప్పటికప్పుడు రోడ్డు ప్రయాణం పెట్టుకున్నారని చెప్పడం పచ్చి అబద్దం. వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

ఫిరోజ్ పూర్ లో ప్రధానిని అడ్డుకున్న చోటు పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 15 కి.మీల దూరంలోనే ఉంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీజీ నుండి రాష్ట్రానికి కచ్చితమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల పేర్లను కూడా ఎస్పీజీ పంపిన నోట్ లో యాడ్ చేశారు. పాకిస్తాన్ ప్రేరేపితమైన ఖలిస్తాన్ ఉద్యమకారులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ముందే డీజీపీకి ఎస్పీజీ అధికారులు లేఖ కూడా రాశారు.

ఈ విషయంలో ఎస్పీఎఫ్, డీజీపీ మధ్య 10 సార్లకుపైగా ఫోన్ ద్వారా సంప్రదింపులు కూడా జరిగాయి. అయిన తరువాత కూడా బ్రిడ్జి మీదకు నిరసనకారులు ఎట్లా వచ్చారు?దీని వెనుక మహా కుట్ర దాగి ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం… ప్రధాని రోడ్డు మార్గాన వెళుతుంటే నిరసన పేరుతో రైతులు అడ్డుకోవాలి. ప్రధానిపై రాళ్లు రువ్వుతారు. అప్పుడు నిరసన కారులపై ఎస్పీజీ సిబ్బందితో కాల్పులు జరిపించి రైతులను చంపేయించే కుట్ర చేసి బీజేపీని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎం, డీజీపిలతో కలిసి పన్నిన మహా కుట్ర ఇది. ఓట్ల కోసం కాంగ్రెస్ శవ రాజకీయాలకు చేసే స్థాయికి దిగజారింది. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతోంది టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలి.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే ఆయనకు రక్షణ కల్పించేది కేంద్ర బలగాలే. సీఎం పర్యటన పూర్తయ్యేంత వరకు పువ్వుల్లో పెట్టుకుని రక్షణ కల్పించి స్వరాష్ట్రానికి తీసుకొస్తారు. ఈ సెన్సు రాష్ట్రానికి ఉండదా? ప్రధాని రాష్ట్ర పర్యటనకు వెళితే పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత విస్మరిస్తే ఎట్లా? ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులైన వారందరినీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.

LEAVE A RESPONSE