సర్కారుపై సమరశంఖం పూరించిన సంజయుడు

– పాదయాత్ర పూర్తి
– కమలవనంలో కదనోత్సాహం
36 రోజులు….. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ పాదయాత్ర ఆగస్టు 28న శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంత నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభతో తొలిదశ పాదయాత్ర ముగియనుంది. రేపటితో కలిపితే మొత్తం 36 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది.
438 కి.మీలు…
ఈ పాదయాత్రలో పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో తొలి అడుగు వేసిన బండి సంజయ్ కుమార్ గారు ఇప్పటి వరకు కాలినడక ద్వారా 432 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈరోజుతో కలిపితే మొత్తం 438 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసినట్లయింది.
35 సభలు….
భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద నుండి ఇప్పటి వరకు పాదయాత్రలో ప్రజలను కలుస్తూనే వారి సమస్యలు వింటూనే భరోసానిచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను వెల్లడించేందుకు ఇప్పటి వరకు మొత్తం 34 సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రేపు జరగబోయే హుస్నాబాద్ సభతో కలిపితే మొత్తం 35 సభలు నిర్వహించినట్లవుతుంది. చార్మినార్, గోల్కొండ, ఆరె మైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, మోమిన్ పేట్, సదాశివపేట, సంగారెడ్డిలో 2, జోగిపేటలో 2, రంగంపేట, నర్సాపూర్ లో 2, మెదక్ లో 2, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిలో 2, ఎర్రపాడు, తాడ్వాయి, లింగంపేట, కామారెడ్డిలో 2, మాచారెడ్డి చౌరస్తా, గంభీరావుపేట, ముస్తాబాద్, అంకిరెడ్డిపల్లె, పెద్ద లింగాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోహెడ, పొట్లపల్లి, హుస్నాబాద్ ప్రాంతాల్లో బండి సంజయ్ కుమార్ గారు సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు…..8 జిల్లాలు
ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కుమార్ తొలిదశ పాదయాత్ర ద్వారా 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నడుస్తూ ప్రజలను కలుసుకున్నారు. మొత్తం 8 జిల్లాల్లో తొలిదశ పాదయాత్ర చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు కవర్ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడిచారు. ఎంపీ సెగ్మెంట్ల విషయానికొస్తే… హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.
11,675 వినతి పత్రాలు…
ఈ పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ గారు లక్షలాది మంది ప్రజలను కలుసుకోగలిగారు. వారి బాధలు విన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత ఉందో స్వయంగా తెలుసుకోగలిగారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులుసహా దాదాపు అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను పరిష్కరించేందుకు క్రుషి చేయాలని కోరుతూ ఇప్పటి వరకు 11,675 వినతి పత్రాలను అందజేశారు. అందరి సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది.
ఇద్దరు మాజీ సీఎంలు, 6 గురు కేంద్ర మంత్రులుసహా 24 మంది జాతీయ నాయకుల రాక
బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్చే పట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు పార్టీ జాతీయ నాయకత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేనవి. ఇద్దరు మాజీ సీఎంలు (దేవేంద్ర ఫడ్నవీస్, రమణ్ సింగ్) 6 గురు కేంద్ర మంత్రులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అట్లాగే 4 గురు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, 4 గురు జాతీయ ఉపాధ్యక్షులు, 4గురు జాతీయ మోర్చాల అధ్యక్షులు, ఇద్దరు జాతీయ కార్యదర్శులు, 4 గురు ఎంపీలు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరుగాక పలువురు కేంద్ర, రాష్ట్రాల మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు .
లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాలు…
బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు తొలిరోజు నుండే రాష్ట్ర ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. బాధలను పంచుకున్నారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాన్ని పొందారు. ఎక్కడికి వెళ్లినా మహిళల మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. యువతీ యువకుల్లో పెల్లుబికిన ఉత్సాహం వర్ణణాతీతం.
ఏ ఊరు వెళ్లినా ఆర్తనాదాలు, అరిగోసలే
ఈ పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ ఏ ఊరు, ఏ వాడ వెళ్లినా అన్నీ సమస్యలే. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, గూడులేని నిర్భాగ్యులు, అరిగోస పడుతున్న రైతులు.. రోడ్డునపడ్డ ఆర్టీసీ కార్మికులు… ఉద్యోగాలు కోల్పోయిన విద్యా వలంటీర్లు, పాఠశాల స్వచ్ఛ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, వేతనాల చాలక, సకాలంలో రాక ఇబ్బంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆర్టీసీ కార్మికులు, హోంగార్డులు, చదువు, సాయం అందని విద్యార్థులతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల ప్రజలంతా బండి సంజయ్ గారిని కలిసి తాము పడుతున్నబాధలను పంచుకున్నారు. వీటితోపాటు ధ్వంసమైన ప్రభుత్వ పాఠశాలలు, కునారిల్లుతున్న ఆసుపత్రుల తీరును, పోడు భూముల బాధిత రైతుల వెతలను పాదయాత్ర ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకు రాగలిగారు.

Leave a Reply