Suryaa.co.in

Telangana

నటుడు కృష్ణంరాజు మృతికి బండి సంజయ్ సంతాపం

బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు అకాల మరణం బాధాకరం. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కృష్ణం రాజు చేసిన సేవలు మరవలేనివి.

జర్నలిస్టుగా, ఫొటో గ్రాఫర్ గా, సినీ నటుడిగా, రాజకీయవేత్తగా సేవలందించిన కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు గెలుచుకున్న మహా నటుడు.

సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘రెబల్ స్టార్’ గా చిరస్థాయిగా అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు ప్రజలతోపాటు వెండితెరకు తీరని లోటు.

కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

LEAVE A RESPONSE