Suryaa.co.in

Telangana

మండుటెండలో….. అలుపెరగని బాటసారి

– జనం సమస్యలు వింటూ భరోసానిస్తూ ముందుకు సాగిన బండి సంజయ్
-కేంద్ర పథకాలు అందుతున్నాయా? అంటూ ఆరా..
-ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణీకులు, డ్రైవర్ తో మమేకం
-కూలీలు, మహిళలు, చిన్నారుల బాధలు పంచుకున్న సంజయ్

మండు టెండను లెక్క చేయలేదు….వడ దెబ్బకు కుంగిపోలేదు… వడ గాలులను పట్టించుకోలేదు. జనంతో మమేకం… జనంతోనే నా పయనం… అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపుతూ నిప్పులు కక్కుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ అలుపెరగని బాటసారిలో జనం బాధలు వింటూ వారికి బీజేపీ అండగా ఉందంటూ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.

• 14వ రోజు పాదయాత్రలో భాగంగా ఈరోజు (27.4.2022) మధ్యాహ్నం వరకు ఓబులాపూర్ నుండి చిన్న పోర్ల, మల్లేపల్లి గేట్, ఎడవల్లీ గేట్ మీదుగా కొల్లూరు వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో మహిళలు, చిన్నారులు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు. వృద్ధుల ఆసరా గురించి ఆరా తీస్తూ, మహిళల క్షేమాన్ని తెలుసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలారు.

• ఉపాధి హామీ పనులకు వెళుతున్న మహిళలు ఆటో దిగొచ్చి బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా ‘‘ఉపాధిహామీ డబ్బులు సరిగ్గా వస్తున్నయా..?జన్ ధన్ ఖాతా తీసుకున్నరా..? ఉజ్వల యోజన స్కీం అమలవుతోందా..?’’ అంటూ ఆరా తీశారు. పేదల సంక్షేమం, జీవన భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఎండల జర పైలం అవ్వా..! అంటూ ముందుకు కదిలారు.

• దారిలో ఆర్టీసీ బస్ ఎదురు కావడంతో బండి సంజయ్ బస్సెక్కారు. అందులోని ప్రయాణీకులను కలిశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎడాపెడా ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనం నెత్తిన కేసీఆర్ భారం మోపారంటూ మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ ను కలిసి సమస్యలపై ఆరా తీశారు. సార్… మీరు మా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కొట్లాడిన సంగతి మేం మర్చిపోం’ అని చెప్పడంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సరిగా జీతాలు అందడం లేదని, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేసీఆర్ ఉన్నంత కాలం ఆర్టీసీ బాగుపడే అవకాశాల్లేవని, బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తామని భరోసానిస్తూ ముందుకు సాగారు.

• మార్గ మధ్యలో పొలం వద్ద రైతులు కన్పించడంతో బండి సంజయ్ వారి వద్దకు వచ్చారు. రైతన్నతో కలిసి గుంటుక కొట్టారు. రైతులు
1 పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతుల బతుకు మారే అవకాశం లేదని, ఏటా పంట నష్టానికి గురవుతున్నా కనీసం పరిహారం కూడా అందివ్వడం లేదని అన్నారు. ‘‘గుంటుకతో కలుపుమొక్కలు ఏరేసినట్టు.. పాదయాత్రతో అరాచక టీఆర్ఎస్ ను తరిమేద్దాం..’’ అని పేర్కొంటూ ముందుకు కదిలారు.

LEAVE A RESPONSE