పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 ఫీట్ల TRS పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక
రామారావు ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పద్మారావు నగర్ TRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్ ను మంత్రి KTR కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్
అలీ, MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి KTR కు పద్మారావు నగర్ TRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ మెమెంటో ను అందజేశారు. తెలంగాణ పాటలు, బాణసంచా చప్పుళ్ళ తో తెలంగాణ భవన్ సందడిగా మారింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నగరంలోని పలు ప్రాంతాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.