Suryaa.co.in

Telangana

కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేదా?

వరదలతో జనం అల్లాడుతున్నా పట్టించుకోరా?
బార్…బీర్ పైనే ధ్యాస తప్ప పేదోడి కన్నీళ్లు తుడిచేవారేరి?
కాళోజీ చెప్పినట్లు…తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఓటుతో తరిమికొట్టాలా? వద్దా?
13వ రోజు పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్
టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, ఆస్తి నష్టమై రైతులు, జనం అల్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కిలోమీటర్ కో బార్…బీర్ అంటూ మద్యంపై ఉన్న ధ్యాస పేదోడి కన్నీళ్లు తుడవడంపై లేదని విమర్శించారు. పరాయివాడు తప్పు చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలి…మనోడు తప్పు చేస్తే పాతరేయాలన్న కాళోజీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ….‘తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఏం చేయాలి. ఓటుతో పాతరేయాలా? వద్దా?’’అని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం చౌట్ కూర్ మండల కేంద్రంలో హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు మాజీమంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, బొడిగె శోభ, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, యువ నాయకుడు ఉధయ్ బాబూ మోహన్, జిల్లా ఇంఛార్జీ జయశ్రీ , మండలాధ్యక్షులు శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యంశాలు…


ఈసారి 100 కోట్లుంటేనే కేసీఆర్ సీటిస్తడట
‘‘బాబూ మోహన్ నన్ను ఎంపీగా గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు. మహారాష్ట్ర సహా ఎక్కడ ఎన్నికలొచ్చినా వెళ్లి ప్రచారం చేసి బీజేపీ గెలుపుకు బాబూ మోహన్ క్రుషి చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం వద్దకు ఓ ఎమ్మెల్యే వెళితే ‘ పెద్ద మనిషి…ఏమైనా పైసలు సంపాదిస్తున్నవా?’అని కేసీఆర్ అడిగిండట. ఎక్కడ సార్…డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నం. సర్పంచులు కూడా బాధపడుతున్నరు అని జవాబిస్తే…‘ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోపో. రూ.100 కోట్లుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటిస్తా’అని చెప్పిండట. కేసీఆర్ అంటేనే తుగ్లక్. టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ. మజ్లిస్ పార్టీ తాలిబన్ పార్టీ.
పత్తాలేని కేసీఆర్
‘‘పాదయాత్రలో ప్రజలు బాధలు చెప్పుకుంటున్నరు. రోడ్డు కోసం స్థలమిస్తే….ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టియ్యలేదు. నేను వెళ్లి చూసిన ఎట్ల బతుకున్నరో అని బాధేస్తుంది. కిలోమీటర్ కో బారు పెట్టిండు. సార్ ధ్యాసంతా బార్, బీర్ మీదే తప్ప జనం మీద లేదు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదు. జనం ఇల్లు లేక నానాపాట్లు పడుతున్నరు. ఎన్నికలొస్తే…ఓ ఇద్దరి ముగ్గురికి ఇండ్లిస్తడు. తరువాత పత్తా లేకుండా పోతడు.
ఇదేం ప్రభుత్వం
‘‘తెలంగాణలో 6.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేసిండ్రు. జనం చస్తుండ్రు. రైతులు నష్టోయిండ్రు. కానీ సార్ పోయి ఢిల్లీ పోయి పడుకుండు. ఇక్కడ పీకేది లేదు. అక్కడ పీకేది లేదు. అసలు ఫాంహౌజ్ లో ఏం చేస్తడో అర్ధం కాలేదు. 7 ఏళ్లు ఫాంహౌజ్ కే పరిమితమైండు. బయట పేదోడికి కోవిడ్ వచ్చినా డాక్టర్లు రారు…కానీ కేసీఆర్ ఫాంహౌజ్ లో కుక్కకి సుస్తీ అయినా అంబులెన్సులు వెళతాయి. కేసీఆర్ కుక్కకున్న విలువ. పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయింది. హైదరాబాద్ లో వరదలొస్తే సీఎం రాలేదు. వరంగల్ లో వరదలొచ్చి పేదల ఇండ్లు మునిగిపోయినయ్. సీఎం మాత్రం హైదరాబాద్ దాటి రాలేదు. ఆర్టీసీ కార్మికులు చస్తే కనీసం స్పందించలేదు. మూర్ఖపు సీఎం కొడుకు నిర్లక్ష్యంవల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు. పేదోళ్ల ఓట్లతో కేసీఆర్ గెలవలేదా? ఇది పేదల ప్రభుత్వం కాదా? మీకు పేదలు అక్కర్లేదా? ఈ ప్రాంతానికి సింగూరు నీళ్లిస్తామని, తరువాత కాళేశ్వరం నీళ్లిస్తామని చెప్పి మాట తప్పి అంచనాలు పెంచి వేల కోట్లు కమీషన్లు దండుకుంటున్నడు.’’
గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన టైగర్ నరేంద్ర సాబ్ నెల రోజులపాటు పాదయాత్ర చేసి సింగూరు జలాల కోసం పోరాడిన నాయకుడు. ఎన్నికలొస్తే కేసీఆర్ కోతలు కోస్తడు. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తడు. కానీ చేసేదేమీ ఉండదు. దళితులకు 3 ఎకరాలన్నడు. ఎంతమందికి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగమిస్తనన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తనన్నడు. కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటేనే దళితులను వంచించే పార్టీ. దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదు. ప్రగతి భవన్ లో రూ.100 కోట్లతో రూములు కట్టుకున్నడే తప్ప అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు.
దళిత బంధు రావాలంటే….ఉప ఎన్నికలు జరగాల్సిందే
ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు? ఇక్కడ దళిత బంధు రావాలంటే ఇక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సిందే. ఈ మాట నేను కాదు. ప్రజలే అంటున్నరు. ఉప ఎన్నిక వస్తేనే రోడ్లు వస్తయి. నీళ్లు వస్తయి. పథకాలు వస్తయని జనం చెబుతుండ్రు. ఉద్యోగస్తులకు జీతాల్లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తాడట. 15 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తలేడు.
కేంద్రం ఇస్తున్న నిధుల ఇవిగో…..
కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు వేల కోట్లు ఇస్తోంది. బియ్యం పైసలు కేంద్రానివే. ఒక్కో కిలోకు 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్రమే. కానీ ఫొటోలు మాత్రం కేసీఆర్ వి పెట్టుకుంటన్నడు. బియ్యం, లైట్ల, రోడ్లు, చెట్ల, కమ్యూనిటీ హాళ్లు, నీళ్లు, టాయిలెట్ సహా చివరకు స్మశానవాటిక నిర్మాణాలకు పైసలిచ్చేది కేంద్రమే. పోతూపోతూ స్మశాన వాటికను చూసిన. ఒక్కో స్మశాన వాటికకు 11.13 లక్షలు, పల్లె ప్రక్రుతి వనానికి రూ.4.23 లక్షలు, డంప్ యార్డ్ కు రూ. 2.50 లక్షలు, నర్సరీకి 1.56 లక్షలు, రైతు వేదికలకు 10 లక్షలు ఇస్తోంది కేంద్రమే. స్వనిధి కింద యువకులకు రూ.10 వేలు ఇస్తోంది కేంద్రమే.
మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ
ఇంటికో ఉద్యోగమన్నడు. కానీ ఇయ్యలేదు. కేసీఆర్ కు , కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రం ఉద్యోగాలిచ్చుకుండు. 1400 మంది యువకుల బలిదానాలు వ్రుథా అవుతున్నయ్. మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని తెలంగాణ తల్లి ఘోషిస్తోంది. ఈరోజు కాళోజీ జయంతి. తెలంగాణ కోసం చావుకు భయపడని వ్యక్తి. చచ్చినా, బతికినా దేశం కోసమేనన్నడు. పరాయివాడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొట్టండి. ఇక్కడోకు ద్రోహం చేస్తే ఇక్కడే పాతిపెట్టాలన్నడు. మరి ద్రోహం చేస్తున్న కేసీఆర్ ను ఏం చేయాలి? యువకులు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆత్మహత్యల తెలంగాణగా మారింది. తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయాలి. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను మతతత్వవాది అంటున్నరు.
దొంగ దీక్షల కేసీఆర్
కేసీఆర్ వన్నీ దొంగ దీక్షలే. తెలంగాణ కోసం ఢిల్లీలో కొద్దిసేపు దీక్ష చేసి దొంగ చాటుకు వెళ్లి లెగ్ పీస్ తినుకుంట కూర్చున్నడట. జర్నలిస్టులు ఇదేందని అడిగితే….వాళ్లను కూడా వచ్చి కూర్చొని తినాలని బలవంతం చేసిండట. కానీ రిపోర్టర్ కుదరదని రాకుంటే జనం రాళ్లతో కొడతారని చెబితే…భయపడి వచ్చి దీక్షలో కూర్చుండట. ఇది జర్నలిస్టులు చెప్పిన మాట. దొంగ ఉద్యమాలు, దొంగ దీక్షలు చేసిండు. పిట్టకథలు, యాసతో మోసం చేసిండు.
హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే నా లక్ష్యం
తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, సమాజాన్నీ చీల్చే పార్టీ ఎంఐఎం. నువ్వు నిఖార్సైన హిందువున్నవ్ కదా….వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకుండా యువకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నవ్. మండపాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? యువకులపై బైండోవర్ కేసులెందుకు పెడుతున్నవ్. ఆంక్షల మధ్య హిందువులు పండుగలు నిర్వహించుకోవాలా? నన్ను మతతత్వవాది అన్నా సరే…80 శాతం హిందువుల కోసం బరాబర్ మాట్లాడతా. నా హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే నా లక్ష్యం.
బీజేపీ ఆదరించండి….ఆశీర్వదించండి
బీజేపీ మీ కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకు…మీ సమస్యలను 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినం. సెప్టెంబర్ 17 నిర్మల్ అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్న. కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతం. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్. కేసీఆర్ నియంత, కుటుంబ, అవినీతి పాలనను ఎండగట్టేందుకే పాదయాత్ర చేస్తున్నం. మీకోసం ఉద్యమాలు చేస్తున్నం. యువత, మహిళ, రైతుల కోసం పోరాడుతున్నం. బీజేపీని ఆదరించండి. ఆశీర్వదించండి.
ఆందోల్ ను ఎండబెట్టి ఫాంహౌజ్ కు నీళ్లను దోచుకుపోతున్న కేసీఆర్ : మాజీమంత్రి బాబూమోహన్
‘‘కేసీఆర్ ఎన్నికలకు ముందుగానీ, సీఎం అయ్యాకగానీ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన నీళ్లు-నిధులు-నియామకాలు హామీలు అమలు చేయకపోతే వేస్ట్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. కానీ వాటి ఊసే లేదు. ఫాంహౌజ్ లోకి పోయి పడుకుంటడు. మా నియోజకవర్గంలో నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. సింగూరు ముంపు గ్రామాలన్నీ ఆందోల్ నియోజకవర్గానివే. కానీ ఏనాడూ చెంబుడు నీళ్లు తాగలేని దుస్థితి ఈ నియోజకవర్గ ప్రజలది. సింగూర్ నీళ్లు మనకే అన్నడు. ఊసే లేదు. తరువాత కాళేశ్వరం నీళ్లను సింగూరులో కలిపి నీళ్లిస్తానన్నడు. కానీ జరగలేదు. మా నియోజకవర్గ ప్రజలు అరిగోస పడుతున్నా వినకుండా 15 టీఎంసీల నీటిని మాత్రం తన ఫాంహౌజ్ కు తీసుకుపోయిండు. ఇక్కడి ఎమ్మెల్యే దద్దమ్మ. జనానికే కన్పించడు.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధాన్యాన్ని రాశులు పొసి అమ్ముకున్నరు. 50 వేల ఎకరాల్లో పంట వేసిండు. నియోజకవర్గానికి నేను తెచ్చిన నిధులతోనే పనులయ్యాయి. కేసీఆర్ తెగ మెచ్చుకున్నాడు. కానీ తరువాత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా కట్ చేసిండు. ఆందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయాలని ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చాక అవన్నీ ఆగిపోయినయ్. ఎమ్మెల్యే కొన్న భూముల దగ్గర మాత్రం చెరువు మట్టిని తీసుకెళ్లి పోయించుకుండు.
ఉద్యోగాల్లేక ఆందోల్ నియోజకవర్గంలో ఇద్దరు చనిపోయిండ్రు. ఉన్న ఉద్యోగాలు పోయి ఫీల్డ్ అసిస్టెంట్ చనిపోయిండు. నియామకాలు సున్నా. ధనిక రాష్ట్రమని చెప్పి జీతాలివ్వకుండా దివాళా తీయించిండు. వీటిని ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోంది.

LEAVE A RESPONSE