టీఆర్ఎస్ నేతలారా…. మీ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే

-రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
-అధికారంలోకి రాగానే కోయిల్ సాగర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
– టీఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి వస్తే నిలదీయండి
-ఒవైసీ నుదుట బొట్టు పెట్టి ‘జై శ్రీరాం’ అన్పించే దమ్ముందా కేసీఆర్ కు
-అగ్రవర్ణాలకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే
-ఆర్టీసీ ఛార్జీలు పెంచి భారం మోపిన కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలెందుకు పట్టించుకోవడం లేదు?
-18వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్

‘‘ ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలపైనా, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నరు. అక్రమంగా కేసులు పెట్టి భయపెడుతున్నరు. నేను చెబుతున్నా… టీఆర్ఎస్ నేతలారా…. మీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులే. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మీరు చేస్తున్న అరాచకాలకు తగిన సమాధానం చెబుతాం.’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్ సాగర్ ద్వారా సాగునీరందించడంతోపాటు ధన్వాడ చెరువును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 18వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం ధన్వాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు..

టీఆర్ఎసోళ్లకు మైండ్ దొబ్బి ప్రజా సంగ్రామ యాత్రకు జనం తరలిరావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ధన్వాడకు వచ్చిన ప్రజలను చూసైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది.ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ నేతలకు దడ, వణుకు మొదలైంది. సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు.
సీఎం ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కొత్త వాళ్లకు పెన్షన్లు రావడం లేదు.కేసీఆర్ కుటుంబంలో మాత్రం 5 గురికి పదవులిచ్చుకుని రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు.

కేంద్రం పేదలకు ప్రతినెలా బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కానీ కేసీఆర్ బంద్ చేయాలని చూస్తున్నరు. రేషన్ బియ్యం వెనుక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్కాం చేస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ బండారాన్ని బయటపెడతాం. కేంద్రం 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా.. కేసీఆర్ మాత్రం ఆ ఇండ్లు నిర్మిస్తే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.

ధన్వాడకు అతి సమీపంలో ఉన్న కోయిల్ సాగర్ నుండి నీళ్లు రాకపోవడం బాధాకరం. లిఫ్ట్ పెట్టి ధన్వాడ సహా చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ససస్యశ్యామలం చేస్తానన్ని టీఆర్ఎస్ హామీలేమైనయ్.టీఆర్ఎస్ నేతలు మీ వద్దకొస్తే… కోయిల్ సాగర్ ద్వారా నీళ్లెందుకు ఇవ్వడం లేదని గల్లా పట్టి నిలదీయండి.

బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్ సాగర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం… ధన్వాడ చెరువును నింపే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నరు. బీజేపీ అంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది.

కేంద్ర పథకాలు అమలు చేస్తున్న నరేంద్రమోదీ ఫొటో పెడితే జడ్పీటీసీపై కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనంపై భారాన్ని మోపిన కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదు?బీడీ కార్మికులు అల్లాడుతున్నరు. వారిని ఆదుకోకుండా కేంద్రంపై నెపం మోపుతున్న సిగ్గులేని నాయకుడు కేసీఆర్.

పేదల భూములను కూడా కబ్జా చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. టీఆర్ఎస్ నేతలారా… మీ ప్రభుత్వం ఉండేది కొన్ని రోజులే.. తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మీ అరాచకాలకు, అక్రమాలకు తగన సమాధానం చెబుతాం.ధన్వాడలోనూ కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం.

రంజాన్ ఇఫ్తార్ విందులో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకుని అల్లాను స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్…. ‘‘నిన్న కేసీఆర్ ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చి ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకుని అల్లాహో అక్బర్ అన్నవ్ కదా… మరి ఒవైసీ నుదుట బొట్టు పెట్టే దమ్ముందా? ఒవైసీ నోట ‘జై శ్రీరాం’ అన్పించే ధైర్యముందా?’

అగ్రవర్ణాల్లో ఎంతోమంది పేదలున్నారు. చాలా మంది బ్రాహ్మణులు బతకలేక అడుక్కునే స్థితిలో ఉన్నరు. వారిని ఆదుకునేందుకే అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత నరేంద్రమోదీదే.కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడంవల్లే యూపీ అభివ్రుద్ధి దిశగా దూసుకుపోతోంది. తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి రావాలి.

Leave a Reply