నాలుగెద్దులు రెండు నక్కల చందంగా

– జగన్ రెడ్డికి పేర్ని నాని బానిసత్వం చేయడం మానుకోవాలి
– టీడీపీ మాజీ శాసనమండలి సభ్యులు బత్యాల చెంగల్రాయుడు

నాలుగెద్దులు ఐక్యంగా తమపై దాడి చేసిన సింహాల్ని సైతం తరిమికొట్టాయి. ఆ ఎద్దుల మాంసమే తినాలనే కుట్ర పన్నిన కరటక,దమనకుడనే రెండు గుంట నక్కలు నాలుగెద్దుల ఐక్యతకు చిచ్చుపెట్టి వాటిని కాజేశాయని మిత్రలాభం, మిత్ర బేధంలో పరవస్తూ చిన్నయసూరి హిత బోధ చేశారు.

2014లో టీడీపీ జనసేన ఐక్యతతో రాష్ట్రం ప్రయోజనం పొందింది. అమాయకులకు ఎరను వేసి చేపను తినే వైసీపీ ఎత్తులు, జిత్తులు ఓడాయి. 2019లో గెలవడానికి పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు, ప్యాకేజీ వంటి పదాలతో రెచ్చగొట్టే కుట్ర ప్రచారంతో మిత్రబేధం సృష్టించి అధికారానికి వచ్చారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు. జనజీవనాన్ని అరాచకంలో ముంచెత్తుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని భయపడుతున్నారు. విడదీస్తే కనీసం ప్రతిపక్షహోదా అయినా దక్కుతుందని ఆశపడుతున్నారు.
అందుకే పేర్ని నానితో నేడు జగన్ మరలా పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టేలా అవాకులు, చెవాకులు పేల్చారు. కాపు రిజర్వేషన్లు రద్దు చేస్తే మాట్లాడలేని పేర్నినాని, ఆత్మ వంచన చేసుకుని భయంతో తాడేపల్లి స్ర్కిప్లు చదివారు. పేర్ని నాని బానిస బ్రతుకు వదిలి కాపు రిజర్వేషన్ల కోసం, అమరావతి రాజధాని కోసం నిలబడకపోతే ప్రజలు క్షమింపరు.