– బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సూచన
ఏలూరు: ఏలూరు పార్లమెంటు జిల్లా కార్యకర్తలు ఉత్సాహంగా శోభా యాత్రలో పాల్గొన్నారు… నరేంద్ర మోడీ బీజేపీని ముందుకు తీసుకుని వెళుతూ ప్రపంచంలో దేశానికి ఖ్యాతిని తీసుకువస్తున్నారని, మోదీని స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో సారథ్యం యాత్ర చేపట్టామని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ మేరకు ఏలూరులో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
ప్రతి జిల్లాలో నూతనోత్సాహం పెల్లుబికింది. సిద్ధాంతం భూమిక తో పనిచేయాలి. దేశం కోసం బలిదానామైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి నేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
వాజపేయి, అద్వానీ వంటి నేతలతో బలపడిన బీజేపీ నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి మంచి రోజులు వచ్చాయి. ప్రతి గ్రామంలో బలమైన పార్టీగా మనం కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు రూపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన ఇంటికి వచ్చారు. ఈ విషయాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలి. రాష్ట్రంలో ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 15వేల కోట్లు నిధులు ఎన్ డి ఎ కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చింది.
జాతీయ రహదారుల నిర్మాణం. అనుసంధానం హైవే లు నిర్మాణం, పర్యాటక, రవాణా అభివృద్ధి చేపట్టింది కొల్లేరు రైతులు సమస్యలు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపనుంది. కొల్లేరు వైవిధ్యాన్ని కాపాడాలి. కొల్లేరు అరాచక శక్తులను అణిచివేయాలి. ఆక్వా ఎగుమతి లకు చర్యలు తీసుకుంటాం. ఆక్వా రంగం ఎగుమతి పై ప్రత్యామ్నాయ మార్కెట్ వైపు ఆలోచన చేస్తున్నాం. చైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ అపూర్వ స్వాగతం పలికింది. చైనా, రష్యా తో కలిసి ట్రంప్ కి సమాధానం చెబుతాం. నిమ్మ మార్కెట్ పై కార్యాచరణ చేపట్టనున్నాం.
స్వదేశీ ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేయాలి. స్వదేశీ వస్తువు లను కొనుగోలు చేయాలి. ఆర్థిక స్వావలంబన ను దెబ్బ తీసే వారి కి బుద్ది చెప్పాలి. కేంద్ర పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా జిల్లా బీజేపీ కార్యాలయాలు పరిపాలన భవనాలు గా మార్చాలి. ఏ అవకాశం వచ్చినా ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాధవ్ పిలుపు ఇచ్చారు.