Suryaa.co.in

Andhra Pradesh

పెన్షన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం

– ప్రాధాన్యత క్రమంలో హామీలను అమలు చేస్తున్నాం
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం : సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారుల్లో ఆనందం వెల్లువిరుస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 21, 24, 25 డివిజన్లో శుక్రవారం కూటమి నాయకులు, అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్ ను వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టనున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రాధాన్యత క్రమంలో హామీలను నెరవేర్చుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.

అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగిందని, అదేవిధంగా యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణను అందిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE