Suryaa.co.in

Devotional

శైవక్షేత్రాలకి వెళితే కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ

కాలభైరవుని అష్టమి తిథి .. కార్తీక మాసం సందర్భం గా శివక్షేత్రాలను మననం చేసుకుందాం. ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగొట్టేలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం ఉంటుంది.

కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో … వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.

భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు … శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE