అరుదైన ‘O’ నెగటివ్ రక్తాన్ని 60 సార్లకు పైగా దానం చేసిన భరత్

– రక్త దాతకు ఘన సత్కారం

రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి… అనే మాటను ఇతరులకు చెప్పడమే కాకుండా తాను కూడా పాటించి అందరినీ మెప్పించారు భరత్. రావులపాలెం పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పూర్తితో అరుదైన ‘O’ నెగటివ్ వర్గ రక్తదాత ఇప్పటి వరకు 60 సార్లకు పైగా రక్తదానం చేసిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన భరత్ ని రావులపాలెం సత్యసాయి సేవామందిరంలో మన్యం వర్ధనరావు, డా. భీమారెడ్డి, వివేకానందరెడ్డిలతో కలిసి పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొవ్వూరి సుధాకరరెడ్డి, అంగర కిషోర్, కంకటాల పవన్ మణికంఠ, వెలగల సతీష్ రెడ్డి, కర్రి సోమిరెడ్డి, గుండుపు శ్రీహరి, పులగం ఉదయ్ కుమార్ రెడ్డి దుశ్శాలువాతో సత్కరించి, మొమెంటో అందచేశారు. ఈ సందర్భంగా రక్తదాత భరత్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలంటే, వారికి అవసరమయ్యే రక్తం చాలా ప్రధానమైనదని అలాంటి రక్తాన్ని దానం చేయాలనే సిద్ధాంతాన్ని నమ్ముకుని, ఇప్పటివరకు పలుమార్లు రక్తదానం చేశానన్నారు. అలాగే అందరూ రక్తదానం చేసి మరొకరికి ప్రాణం దానం చేయాలని పిలుపునిచ్చారు.