రాజకీయాలకు అతీతంగా పీవీకి భారతరత్న

-ఇది మోడీ చిత్తశుద్ధికి నిదర్శనం
-బిజెపి కార్యాలయంలో పీవీ చిత్రపటానికి నివాళులు

నరేంద్ర మోదీ ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కి భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీవీ నర్సింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ అన్నావజుల సూర్య ప్రకాశ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ , కప్పర ప్రసాద్ , విజయలక్ష్మీ , తదితరులు పాల్గొన్నారు.

తన మేథస్సుతో, ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధిలో నిలిపిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు.

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో రాజకీయ పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించింది.

పీవీ నర్సింహారావుకి భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

Leave a Reply