Suryaa.co.in

Telangana

తెలంగాణ కాంగ్రెస్ లో కూడా బిజెపి కోవర్టులు

– రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి
– అమ్ముడుపోవడం రేవంత్ రెడ్డికి అలవాటు.
– రజతోత్సవం వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోతన పాలన రెఫరండంగా నాకు ఓటు వేయండి అని అడిగాడు రేవంత్ రెడ్డి
– ప్రజలు చిత్తుచిత్తుగా ఓడగొట్టారు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డే కారణం
బిజెపి టిడిపితో పొత్తులో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ కి బాబును అడిగే ధైర్యం లేదు
– వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఏర్పాట్లను, స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు

వరంగల్: గుజరాత్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లో మోడీ కోవర్టులు ఉన్నారు అని అన్నాడు. దీనికి బలం కలిగిస్తూ రేవంత్ రెడ్డి మోడీ మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అని అన్నాడు. రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి. తెలంగాణలో కూడా బిజెపి కోవర్టులు ఉన్నారు.

మోడీ కి భయపడి దగ్గరుండి బీజీపీకి గిఫ్టుగా గెలిపించాడు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బడే భాయ్ కోసం చోటే భాయ్ తోఫా ఇచ్చాడు.పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. అమ్ముడుపోవడం రేవంత్ రెడ్డికి అలవాటు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోతన పాలన రెఫరండంగా నాకు ఓటు వేయండి అని అడిగాడు రేవంత్ రెడ్డి. ప్రజలు చిత్తుచిత్తుగా ఓడగొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డే కారణం. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను రేవంత్ రెడ్డి గెలిపించాడు.

ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో రజతోత్సవ సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమానికి వరంగల్ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన రోజు, మిలియన్ మార్చ్ జరిగిన రోజు.

. పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతుబంధు పథకం జాతీయ స్థాయిలో పీఎం కిసాన్ పథకానికి ప్రేరణనిచ్చింది. దేశంలో అత్యంత ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికలు తీసి ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు ఒకటే ఇచ్చి మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2500 ఎగ్గొట్టారు. రైతుబంధు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు.

ఇచ్చిన హామీల అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది అయితే, హామీ ఇవ్వకపోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ ది.
రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశాం.

రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. రజితోత్సవ వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు. ఈ వేడుకలు ఏడాది పాటు జరపాలని పార్టీ నిర్ణయించింది. వరంగల్‌లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణ ప్రసవించిన బిడ్డ బిఆర్ఎస్ పార్టీ. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బనకచర్ల నుండి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించకపోతే ప్రశ్నించింది బిఆర్ఎస్ పార్టీ.

తెలంగాణలో కట్టే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా గోదావరి జలాలను ఎలా తరలించకపోతారని ఆంధ్రప్రదేశ్ ని నిలదీసింది బిఆర్ఎస్ పార్టీ.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయి. బిజెపి టిడిపితో పొత్తులో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ కి బాబును అడిగే ధైర్యం లేదు. ప్రజల పక్షాన నిజాయితీగా ధైర్యంగా నిలబడే శక్తి ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే.

నా ఎత్తు గురించి మాట్లాడి బాడీ బాడీ షేమింగ్ చేశారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క. వారిలా ఎత్తు గురించి మాట్లాడను. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటే 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది బిఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో ఆరుగురితో మంత్రి పదవులకు రాజీనామా చేయించి కొట్లాడిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ.

LEAVE A RESPONSE