Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి రక్తం లో బిజెపి డిఎన్ఎ

– కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే
– ఆ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులు
– బిఆర్ఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉంది
– మాజీ మంత్రి కొప్పుల

హైదరాబాద్: నువ్వు కొట్టినట్టు చేస్తే.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ తీరు. ఇరు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పటికే పలుమార్లు బయటపడిందని గుర్తు చేశారు.ఛోటే భాయ్‌కా బడే భాయ్‌.. ఈనాటి ఈ బంధం ఏనాటిదో! ప్రధాని టూర్‌లో మోదీని తన పెద్దన్నగా ఒప్పుకున్నది రేవంత్‌రెడ్డి కాదా పని ప్రశ్నించారు.

గతంలో మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తాను ఆరెస్సెస్‌ అనుబంధ పత్రిక జాగృతిలో పనిచేసినట్టు తన ఐడెంటిటీని అక్కడి రిజిస్టర్‌లా రాసుకోవడం ద్వారా తాను ఆరెస్సెస్‌ వాదినని, బీజేపీకి దగ్గరి వ్యక్తినని చెప్పకనే చెప్పారు..!

ప్రధాని మోడీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘పెద్దన్న’ అంటూ మోదీపై ప్రత్యేక ప్రేమాభిమానాలు కనబరిచారని. దీనినిబట్టి ఇరు పార్టీల మధ్య ఉన్న చాటుమాటు ఒప్పందం ఉందని ఆరోపించారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు, అలాగే హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్ళను నెలమట్టం చెస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ను బిజెపి ఎంపి లు, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తం లో బిజెపి డిఎన్ఎ ఉందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు..తాము వందల విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని కేంద్రం.. రేవంత్‌ వెళ్లి రాగానే అన్నీ మంజూరవుతున్నాయని గుర్తు చేస్తున్నారు.

LEAVE A RESPONSE