Suryaa.co.in

Telangana

గవర్నర్ ను అడ్డం పెట్టుకుని బిజెపి నీచ రాజకీయాలు

ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా?
విశ్వబ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్టు కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలి
ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారు
ఉత్తరప్రదేశ్లో బిజెపి వాళ్ళకి నామినేట్ పదులు కట్టబెట్టారు
ఆ రాష్ట్రానికి ఒక నీతి… మన రాష్ట్రానికి ఒక నీతా..?
చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు
గిరిజన సంక్షేమ శాఖ ఎరుకల సాధికారత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
60 కోట్లతో మెదక్లో జిల్లాలో ఎరుకల సాధికారత కార్యక్రమం ప్రారంభం

మెదక్ జిల్లా : ప్రాథమికంగా ప్రభుత్వ భూములు ఇచ్చి ఆర్థిక సాయం అందించి సొసైటీలుగా అవకాశం కల్పిస్తాం.3 దశలలో ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం సహకారాలు.1,సొసైటీలు, 2 స్లాటర్ హౌసులు , కోల్డ్ స్టోరేజిలు ,3 రవాణాసౌకర్యాలు, ఆన్లైన్ వ్యాపార మెళుకువలలో ప్రావీణ్యం పెంపొందించడం.పెంచిన పందులను హైదరాబాద్ తరలించడానికి వాహనాలు అందుబాటులోకి తెస్తాం.

ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం.వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో కుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తాం.రాష్ట్రంలో మొదటి సారి ఎరుకలజాతి ఎదుగుదలకు సొసైటీలు ఏర్పాటు.ఎరుకల జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఉంది. అందుకే ఎమ్మెల్సీగా తీసుకున్నాం.ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారు. ఎరుకల జాతిలో ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాం.ఇలాంటివారిని గవర్నర్ తిరస్కరించారు.

దేశంలోనే బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తోంది.ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే, జాతి మొత్తం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నర్ కి అనుమానం. విశ్వబ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్టు కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలి. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా?

బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? బిజెపి వాళ్ళు గవర్నర్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుంది …వారికి గట్టి గుణపాఠం చెప్పాలి ఉత్తరప్రదేశ్లో బిజెపి వాళ్ళకి నామినేట్ పదులు కట్టబెట్టారుఆ రాష్ట్రానికి ఒక నీతి… మన రాష్ట్రానికి ఒక నీతా.. కులాలు, జాతుల గురించి ఆలోచించిన వ్యక్తి కెసిఆర్.

చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు. చివరకు అందరూ కలిసి ఆయన్ని బ్యాన్ చేశారు. పాపం ఆయన జైల్లో ఉన్నాడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు.విద్యా వైద్యంలో 10 శాతం రిజర్వేషన్ వల్ల ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో రాణిస్తున్నారు.

ముఖ్యమంత్రి 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్లే ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారు. గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బిజెపి శకుని రాజకీయం చేస్తుంది.పిల్లల చదువులు, జీవితాలతో బీజేపీ రాజకీయం చేస్తుంది. బిజెపి బ్యాక్ డోర్ రాజకీయాలు మానుకోవాలి.

LEAVE A RESPONSE