Suryaa.co.in

Andhra Pradesh

అటల్ జీ బాటలో బీజేపీ

పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

విజయవాడ, మహానాడు: అటల్ బిహారి వాజపేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వాజపేయికి పలువురు పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ మాట్లాడారు. వాజపేయి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం.. ఆయన ఒక అజాత శత్రువు.. 1952 నుంచి కాలం చేసే వరకు శత్రువులు లేరు.

పార్టీల పరంగా వేరైనా సరే వ్యక్తులకు ఇచ్చే సిద్ధాంతాలు, ఆశయాలు గొప్పవి.. సిద్ధాంతం పరంగా, పార్టీ పరంగా వేరైనా ఒక ప్రధాని ఫోటో ఉండాలి అని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి వాజపేయి. అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు ఎవరికీ తలొగ్గకుండా తన సిద్ధాంతానికి కట్టుబడ్డారు. పాకిస్థాన్ మనపై యుద్ధం ప్రకటించినప్పుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు.. దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఉండాలని గొప్ప సంకల్పంతో ప్రణాళికలు అమలు చేశారు.

33 ఏళ్ళలో రాజకీయాల్లో గెలిచి పార్లమెంట్ సభల్లో అడుగు పెట్టారు.. బీజేపీకి మొదటి జాతీయ అధ్యక్షుడు వాజపేయి.. బీజేపీని బలోపేతం చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు.. పార్టీ కంటే దేశభక్తి ముఖ్యం అనే నినాదంతో ఉన్న గొప్ప వ్యక్తి. ఆ నాడు గొప్ప రహదారుల ప్రణాళికతోనే నేడు ప్రధాని మోదీ ఆరు లైన్ల రహదారుల నిర్మాణంతో ముందుకు వెళ్తున్నారు. ఆనాటి వాజపేయి సిద్ధాంతంతోనే నేడు ప్రధాని మోదీ మౌలిక వసతుల కల్పనతో ముందుకు తీసుకుపోతున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, పార్టీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బీజేపీ అధికార ప్రతినిధులు పూడి తిరుపతి రావు, పెద్దిరెడ్డి రవికిరణ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, కర్నూలు జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్, నూతలపాటి బాలకోటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE