-మోడీ కాదు ఆయన్ను మోడు అని పిలవాలి
-బీజేపీ అంటేనే భ్రష్టాచార జనతా పార్టీ
-మాది అవినీతి పాలన అయితే తెలంగాణ కు అవార్డులు ఎందుకు ఇస్తున్నారు?
-మోడీ కి కర్ణాటక లో ఓ రౌడీ షీటర్ ఫైటర్ రవి స్వాగతం
-పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి
నరేంద్ర మోడీ కి కర్ణాటక లో మొన్న ఓ రౌడీ షీటర్ ఫైటర్ రవిస్వాగతం పలికారు.హైదరాబాద్ లో పేపర్ లీకర్ బండి సంజయ్ స్వాగతం పలికాడు.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆదుకున్నందుకు శభాష్ అని మోడీ సంజయ్ ని పొగిడినట్టుగా ఉంది.అందరికీ పేపర్ లీకేజీ గురించి నేర్పించు అని మోడీ బండి సంజయ్ కు చెప్పినట్టుగా ఉంది.
మోడీ వి అవే మాటలు .. అవినీతి కుటుంబ పాలన.అవినీతి లో తెలంగాణ చిట్ట చివరన ఉంది అని లోక్ నీతి సర్వే లో వెల్లడైంది.మాది స్కాం ల ప్రభుత్వం కాదు.. స్కీం ల ప్రభుత్వం.బీజేపీ a to z స్కాం ల పార్టీ.ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని స్కాం లు చేసిన పార్టీ బీజేపీ.
బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ.మా ప్రాజెక్టులకు నిధులివ్వకుండా అడ్డుకుంటున్నది కేంద్రప్రభుత్వమే.నగదు బదిలీ పథకాల్లో ప్రపంచం లో తెలంగాణే నెంబర్ వన్.దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్.80 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్ల లోకి వేసిన దమ్మున్న సీఎం కేసీఆర్.మోడీ ఇలాంటి పనులు చేశారా?
వందే భారత్ రైలు ను మోడీ ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?వందే భారత్ చార్జీలు విమానం చార్జీలాగా ఉన్నాయి.పాత గోడలకు సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా ఉంది మోడీ తీరు.కుటుంబ పాలన అంటున్నమోడీకి బీజేపీ లో నేతల వారసులు ఎంత మంది ఉన్నారో తెలియదా?జై మోడీ అంటే నహి ed, నహి మోడీ అంటే జై ed.
మాది అవినీతి పాలన అయితే తెలంగాణ కు అవార్డులు ఎందుకు ఇస్తున్నారు?బీజేపీ అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమ కారులు. ఇప్పుడు పదవుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యులు ఉద్యమం లో పాల్గొన్న వారే.మోడీ సహా బీజేపీ లో చాలా మందివి నకిలీ సర్టిఫికెట్ లే.మోడీ దగ్గర సర్టిఫికెట్ లేదట.. బండి దగ్గర ఫోన్ లేదట.తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో లేఖలు రాశారు.. అయినా మోడీ చేసిందేమీ లేదు.
కేంద్రం ఇచ్చిందేమి లేదు.. ఇక రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపటానికి ఏం ఉంది?కుంభ కోణాల్లో మునిగిన వారు బీజేపీ లో చేరగానే కేసులు మాయమవుతున్నాయ్.సుదేందు అధికారి, జ్యోతిరాదిత్య సిందియా, భావన గావ్లీ ,సీఎం రమేష్ ఇలా ఎంతో మంది బీజేపీ లో చేరగానే విచారణ లు ఆగిపోయాయి. మోడీ ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేదు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి దేశ వ్యాప్తంగా వచ్చేవి రెండు ఎంపీ సీట్లే.మోడీ కాదు ఆయన్ను మోడు అని పిలవాలి.కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.