Suryaa.co.in

Andhra Pradesh

రుషి కొండను బోడి కొండగా మార్చారు

-స్టిక్కర్ ప్రభుత్వం ఇది
-రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షం బిజెపి మాత్రమే
-విశాఖ అభివృద్ధి కి బిజెపి మాత్రమే వారసులం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విశాఖ పట్నం : పేద ప్రజల ను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది. రుషి కొండ ను బోడి కొండ గా మార్చారు అంటూ తీవ్ర స్వరంతో వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు పేరు తో టిడ్కో ఇళ్ళ పై వైసీపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే బ్యాంకు లనుండి నోటీసు లు వస్తున్నాయి అంటే, వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ను పచ్చిమోసం చేస్తోంది. వారి కి అండగా బిజెపి ఉంటుంది.

రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షం బిజెపి మాత్రమే. ప్రజల పక్షాన బిజెపి మాత్రమే నిలబడింది. రైల్వే జోన్ కార్యకలాపాలు కు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా, బిజెపి పై బురద జల్లే ప్రయత్నం ఏంటని ప్రశ్నిస్తున్నాం. సంస్థాగతంగా పటిష్టం చేయడానికి పర్యటన సాగుతోంది ఇప్పటి వరకు 20 జిల్లా లు పూర్తి చేసా. రాజకీయ స్థితి గతులు అధ్యయనం. కేంద్రం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు చెబుతూ ధైర్యం గా వెళుతున్న ఏకైక పార్టీ బిజెపి.

కేంద్రం ఆర్థిక సహకారాన్ని జిల్లా కు నిధులు ఇచ్చాం. విశాఖ లో ఇఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సమీక్ష నిర్వహించాం. “బిజెపి తో విశాఖ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్ ఎస్ ఎన్ రెడ్డి బిజెపి మేయర్ గా పని చేశారు. విశాఖ అభివృద్ధి కి బిజెపి మాత్రమే వారసులం. వాజ్ పాయ్ హయాం లో అభివృద్ధి రహదారులు నిర్మాణం. ఐఐఎం ఆగస్టు నెలలో శంఖుస్థాపన..తరగతులు జరుగుతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ పెట్రోలియం.ఐఐటీ ఖరగ్ పూర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ, నైపుణ్యం అభివృద్ధి క స్కిల్ డెవలప్మెంట్ .నైపుణ్యం శిక్షణ భోజనం వసతి ఏర్పాటు. వైద్య రంగం అభివృద్ధికి కంభంపాటి హరిబాబు ఎంపీ గా ఉన్న సమయంలోనే అనేక పనులు జరిగాయి

మెడ్ టెక్ పార్క్ ద్వారా వైద్య పరికరాలు నడిపూడి లో ఏర్పాటు. మెడిటెక్ పార్క్ కారణంగా వైద్య పరికరాలు ఎగుమతి దశకు చేరుకుంది. విశాఖ నగరంలో 500కోట్లతో 400 పడకల ఆసుపత్రి ఇఎస్ఐ ఆసుపత్రి. భూమి ఇవ్వని కారణంగా ఆలస్యం టిడిపి ప్రభుత్వం ఇవ్వలేదు, నేటి వైసీపీ ప్రభుత్వం కూడా ఆలస్యం. 2025నాటికి. ఆసుపత్రి పూర్తి. తగినంత భూమి ఇవ్వని కారణంగా మెడికల్ కాలేజీ రాలేదు దీనికి టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు భాద్యత వహించాలి. 15సం.లుగా సాగు తోంది.

LEAVE A RESPONSE