Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా

– అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు
– వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు
– మంత్రి రోజా

అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో నేనే ఉంటున్నా. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాను. నేను జగనన్న సైనికురాలిని, ఆయన మాటే నాకు శిరధార్యం. చంద్రబాబు, పవన్ రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారు. నాకు పక్కాగా ఎమ్మెల్యే సీటు వస్తుంది. నేను మళ్ళీ గెలుస్తున్నాను. 2024లో జగనన్న కూడా సీఎంగా మళ్ళీ గెలుపు ఖాయం.

LEAVE A RESPONSE