Suryaa.co.in

Andhra Pradesh

లోకేశ్ సభకు ఖరీదైన యాంకర్ పవన్ కల్యాణ్

– పవన్ కు నోట్లు, సీట్లు ఆఫర్ చేసిన బాబు
– టీడీపీ ఉనికి కోసం జరుగుతున్న సభకు బాబు, పవన్ లు హాజరు.
– పవన్ కల్యాణ్ ను సోదరుడు అని లోకేశ్ పిలవగలడా..లేక పవన్ చౌదరి అంటాడా?
– లోకేశ్ ది ఒక అసమర్ధుడి విజయోత్సవ సభ
మంత్రి అంబటి రాంబాబు

లోకేశ్‌ది ఎటువంటి ప్రభావం లేని, ఎవరూ గుర్తించని యాత్ర:
నారా చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేశ్‌ జనవరి 27న కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.చాలా ఆపసోపాలు పడుతూ..మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగించాడు. ముగిసిన సందర్భంగా పోలిపల్లిలో రేపు విజయోత్సవ సభ పెట్టారు. దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్న విషయాలు చూస్తే హాస్యాస్పదంగా కనపిస్తోంది.

226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు నారా లోకేశ్‌ నడిచాడని చెప్తున్నారు. ఆయన నడిస్తే ఏంటట..? దాని ప్రభావం ఏమైనా అతనిపైనైనా ఉందా? లేదు అతని పార్టీపైన కానీ, ఈ రాష్ట్రంపైనైనా ఉందా? ఎటువంటి ప్రభావం లేని, ఎవరూ గుర్తించని యాత్ర. పాదయాత్ర తర్వాత ఆయనలో ఏదైనా వికాసం కన్పించిందా అంటే అదీ లేదు.

ఈ సందర్భంలో నాకు ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేకానీ తెలుపు కాదు’ అనే వేమన పద్యం గుర్తుకు వస్తోంది. లోకేశ్‌ లాంటి ఒక అపరిపక్వత గల వ్యక్తిని, ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలూ లేనటువంటి వ్యక్తిని నడిపిస్తే ఏమీ మార్పు రాలేదు. నాకైతే ఒక మార్పు కనపించింది. కాస్తంత సైజ్‌ తగ్గాడు. ఒళ్లు తగ్గింది కానీ బుర్ర మాత్రం ఏమీ పెరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

ఆయన పాదం పెట్టగానే నందమూరి వంశస్థుడు పోయాడు:
కుప్పంలో ఆయన అడుగు పెట్టగానే తారకరత్న నాలుగడుగులు వేసి కుప్పకూలి పోయాడు.ఆస్పత్రిలో సుమారు 22 రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పొందారు. నారా లోకేశ్‌ పాదయాత్ర పాదం పెట్టగానే నందమూరి వంశస్థుడు టపామని రాలిపోయాడు. అంతటి అశుభంతో ప్రారంభమైన యువగళాన్ని అలానే కొనసాగించారు. జనం లేక వెలవెలబోయిన సందర్భాలు, జనం కోసం వెయిట్‌ చేసిన సందర్భాలు అనేకం. యువగళం బ్రహ్మాండంగా సక్సెస్‌ అవుతోందని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం చేశారు. కానీ జనం మాత్రం పట్టించుకోలేదు.

ఆ 53 రోజులూ లోకేశ్‌…లొకేషన్‌ లేకుండా పోయింది:
నేనే చాలా సీనియర్‌ని, చక్రం తిప్పిన వ్యక్తి అని చెప్పుకునే లోకేశ్‌ నాన్నగారు సాక్షాధారాలతో దొరికిపోయి జైలుకు వెళ్లాడు. 53 రోజులు రిమాండ్‌లో ఉంటే యువగళం మూగబోయింది. అసలు యువగళం పెట్టిన వ్యక్తి లోకేషన్‌ లేకుండా పోయింది. ఢిల్లీ వెళ్లి అక్కడ కనిపించకుండా తిరుగాడు. ఇంతటి హాస్యాన్ని పండించిన వ్యక్తిని రాజకీయాల్లో నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు.
ఇంత నడిచినా సోదరులను చౌదరులు అనే అంటున్నాడు. మాట్లాడితే మేం అధికారంలోకి వస్తే…అంటాడు. వచ్చేది లేదు చచ్చేది లేదు. ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామంటూ ముగ్గరుంటే రూ.90 వేలన్నాడు. మూడు 15లు తొంబై అని తెలిసిన ప్రబుద్ధుడు లోకేశ్‌.

టీడీపీ బతికే ఉందని చెప్పుకునేందుకే ముగింపు సభ:
చంద్రబాబు యువగళానికి జనం రావడం లేదని మంచి మంచి యాంకర్లను తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లాలో ఉదయభాను అనే ఒక యాంకర్‌ను తీసుకువచ్చారు. బీసీ సదస్సుకు ఆమెను యాంకర్‌గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించారు. ఆమెను చూడటానికి వచ్చిన జనాన్ని చూపి యువగళం సక్సెస్‌ అయిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతటి దిగజారిన పరిస్థితులకు ఆ యాత్ర నెట్టబడింది.

మంత్రిగా చేసిన వ్యక్తి, చంద్రబాబు కుమారుడు పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్లను తీసుకొచ్చుకునే దుస్థితి. ఇప్పుడు ఆయన యాత్ర ముగించాడట..అద్భుతమైన సభ జరపాలట. సభ అద్భుతంగా జరిగింది…తెలుగుదేశం బతికే ఉందని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపటి సభకు ఉదయభాను కంటే ఖరీదైన యాంకర్లు దొరికారు. ఒకరు బాలకృష్ణ. మరొకరు దత్తపుత్రుడు. బాలకృష్ణ సినిమా హీరో..బయటకు వస్తే మీసం తిప్పి హాస్యం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరు. ఆయన బంధు యాంకర్‌..మామ గారు కాబట్టి ఆయనకు ఉదయభానులా రెమ్యునరేషన్‌ అవసరం లేదు.

మరో యాంకర్‌ వస్తున్నారు..ఆయన కొద్దిగా ఖరీదైన యాంకర్‌. బాలకృష్ణలా బంధంతో, ఉదయభానులా రెమ్యునరేషన్‌తో ఆయన రాడు. ఆయనకు నోట్లు కావాలి..సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు. ఒక అసమర్ధుడైన కుమారుడిని నాయకుడిని చేయడం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాట్లు ప్రజలు గమనించవచ్చు. పాపం చంద్రబాబు పడుతున్న ఆవేదన చూస్తుంటే కాస్త జాలేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లో ఊదరగొడితే పెద్ద నాయకుడు అయిపోతాడు అనుకుంటున్నారు. యువగళంఅంతగా విజయవంతంమైతే బాలకృష్ణ, దత్తపుత్రుడిల యాంకరింగ్‌ ఎందుకు?

సీట్లు, నోట్లతో ఎట్టకేలకు దత్తపుత్రుడి యాంకరింగ్‌:
నువ్వొస్తే జనం బాగా వస్తారు..నువ్వు ముగింపు సభకు రావాలి అని చంద్రబాబు అడిగాడు. దత్తపుత్రుడు దానికి కాదన్నాడు. రానన్నాడని నాదెండ్ల మనోహర్‌ ద్వారా నువ్వైనా చెప్పమని అడుక్కున్నాడు. అయినా కుదరలేదు..చివరికి చంద్రబాబే నేరుగా దత్తపుత్రుడి ఇంటికి వెళ్లాడు. సీట్లు, నోట్లు మాట్లాడుకున్నాడు. ఉదయభానుకు కేవలం నోట్లే..ఈయనైతే నోట్లు, సీట్లు ఇస్తానంటే అప్పుడు వస్తానన్నాడు. చంద్రబాబు వద్ద కిరాయి తీసుకుని యాంకరింగ్‌కు వెళ్లే స్థాయికి దిగజారిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.

ఇది రాష్ట్ర ప్రజలు, జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరుతున్నా. ఒక అసమర్ధుడిని, ఒక సునకాన్ని కనకపు సింహాసనం ఎక్కించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే..మన ప్రబుద్ధుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు వెళ్తున్నాడు. ఆయన ఎక్కడా గెలవలేదు..ఈయనా ఎక్కడా గెలవలేదు. కాకపోతే లోకేశ్‌కు జనం రారు..పవన్‌ కల్యాణ్‌ను చూడ్డానికి మాత్రమే వస్తారు. ఆ విషయం పవనే చెప్పారు. స్పెషల్‌ ఫ్లైట్, ట్రైన్‌లు, బస్సులు, కార్లు అన్నీ దించేశారు. దోచేసిన డబ్బుతో అన్నీ దించేశారు. రేపు తిరణాల చేయాలని యాంకర్లను తీసుకున్నాడు. రేపు సినిమా చాలా కామిడీగా ఉంటుంది.

పవన్‌ కల్యాణ్‌ని సోదరుడు అంటాడా…చౌదరి అంటాడా?:
లోకేశ్‌ను ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆయన్ను పవన్‌ కల్యాణ్‌ సోదరుడు అనమనండి..లేదా సోదరుడు పవన్‌ కల్యాణ్‌ అనమనండి. పవన్‌ కల్యాణ్‌ చౌదరి అనో…చౌదరి పవన్‌ కల్యాణ్‌ అంటాడు. అంతకు మించి తేడా తెలియదు. అలాంటి ప్రబుద్ధుడు రేపు విజయ యాత్ర చేసుకుంటే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా దత్తపుత్రుడు వెళ్తున్నాడు. చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్‌ సినిమాను రజతోత్సవంలా చేస్తే సక్సెస్‌ అవుతుందని భావించి ఒక మానిప్యులేటర్‌ తండ్రి చేస్తున్న ప్రయత్నంలా దీన్ని భావించాలి. యువగళం అంతా అట్టర్‌ప్లాప్‌ షో..అశుభాలతో జరిగిన యాత్ర.

యాంకర్‌గా తయారైన పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలి కలుగుతోంది. చివరికి ఆయన వెళ్తాడా లేదా అనేది కూడా అనుమానం. ముడితే వెళ్తాడు..లేదంటే వెళ్లడు. ప్యాకేజీ అందితే సై…అందకపోతే నై…మధ్యలో సూట్‌ కేసులు మోసేది నాదెండ్ల మనోహర్‌. చివరికి జనసేన అనే పార్టీని లోకేశ్‌ను కనకపు సింహాసనం ఎక్కించడానికి ఉపయోగపడే స్థాయికి దిగజారినందుకు జనసైనికులు ఆలోచించుకోవాలి.

అది ఒక అసమర్ధుడి విజయోత్సవ సభ:
ఆర్టీసీ బస్సులు కార్పొరేషన్‌ వారిష్టం..వాళ్లు ఇవ్వలేదంటే నమ్ముతారా? ఆర్టీసీ బస్సులైతే లెక్క తెలుస్తుందని వీళ్లు అసలు అడిగి ఉండరు. ప్రైవేటు బస్సులైతే వేలవేల బస్సులు వచ్చాయని చెప్పుకోవచ్చని వారి ఆలోచన కాబోలు. పాపం అసమర్ధుడి విజయోత్సవ సభకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. లోకేశ్‌ ఏం యుద్ధం చేశాడో చెప్పాలి…పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప.

ఆయన ప్రజల్లో గెలవకుండా మంత్రి చేశాడు. అలాంటి వ్యక్తికి ప్రజాదరణ ఏముంటుంది? మధ్యలో ఎందుకు పాదయాత్ర ఆపేశాడు..? 53 రోజులు ఎందుకు సెలవు పెట్టాడు. లోకేశ్‌ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు. ఎప్పటికీ కాలేడు. రాజకీయాలకు పనికివచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. ఏదో ఆతని అదృష్టం కొద్దీ చంద్రబాబు కుమారుడు అవ్వడం వల్ల అతన్ని మోసి నాయకుడిని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ తెల్లజెండా ఎత్తేంత వరకూ లోకేశ్‌ నిద్రపోడు:
ఎర్ర బుక్కు వాళ్ల నాన్నకు ఒరిజనల్‌ ఇస్తాడట..ఒక కాపీ ఈయన వద్ద పెట్టుకుంటాడట. ఇంకో కాపీ వచ్చే యాంకర్‌ పవన్‌ కల్యాణ్‌కు కూడా ఇవ్వు. నీ పార్ట్‌నరే కదా. తెలుగుదేశం పార్టీ తెల్ల జెండా ఎత్తేంత వరకూ లోకేశ్‌ నిద్రపోయేటట్లు లేడు. లోకేశ్‌ బాబు ఒక ఐరెన్‌ లెగ్‌..అతను కాలుపెట్టాడు..టీడీపీ కుంగింది.యువగళం ప్రారంభించాడు..ఇంకా కుంగింది. ఎర్రబుక్కు అన్నాడు…తెల్లజెండా ఎత్తేస్తారు. ఎన్నికల తర్వాత ఎంత మంది కలిసొచ్చినా ఒరిగేదేమీ లేదు.

175 సీట్లతో జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు:
మా పార్టీ అంతర్గతంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇది సహజమైన విషయం. శాస్త్రీయంగా ఆలోచించి మా ముఖ్యమంత్రి మార్పులు చేస్తూ 175 సీట్లు గెలిచేలా ముందుకు వెళ్తున్నాం. ఫలితాలు ఎన్నికల తర్వాత చూస్తారు. అసంతృప్తులు ఏమీ ఉండవు..ఖచ్చితంగా జగన్‌ 175 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంతర్గతంగా మేం అందరితో మాట్లాడుకుంటున్నాం. అంసతృప్తులు అంటూ ఏమీ ఉండవు.

నిజమే..జగన్‌ లాంటి నాయకుడిని ఇంతవరకూ చంద్రబాబు తన జీవితంలో చూసి ఉండడు.అంతటి వ్యూహంతో పటిష్టంగా దూసుకుపోతున్న వ్యక్తి జగన్‌ . జగన్‌ వ్యూహాలను చూసి టీడీపీ భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నేను ట్రాన్స్‌ఫర్లు చూడలేదు అంటాడు..ఈయనెందుకు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాడు..? వాళ్లబ్బాయిని మంగళగిరిలో ఎందుకు పెట్టాడు.? బాలకృష్ణను హిందూపురంలో ఎందుకు పెట్టాడు..?

LEAVE A RESPONSE