Suryaa.co.in

Telangana

కేసీఆర్..తెలంగాణ నీ తాత సొత్తు కాదు

– బీజేపీ శాసనభాపక్ష నేత రాజాసింగ్

రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సభ్య సమాజం ఛీ కొడుతోంది. ఆ చర్చను దారి మళ్లించేందుకే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యల చేస్తున్నారు.

తెలంగాణ నీ తాత సొత్తు కాదు…. తెలంగాణ ప్రజలకు నీ సంగతి పూర్తిగా అర్ధమైంది. ఇక నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. లాక్ డౌన్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం.కేసీఆర్…..లాక్ డౌన్ పెట్టకపోతే అసలు నువ్వు బతికి బట్టకట్టేవాడివా? బ్రిటన్ ప్రధాని సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విషయంలో భారత్ ను ప్రశంసించిన సంగతి మర్చిపోయినవా?కాంగ్రెస్, టీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఈరోజు కేసీఆర్ వ్యాఖ్యలతో బట్టబయలైంది.పార్లమెంట్ లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

ప్రధాని నరేంద్రమోదీపై అవినీతి ఆరోపణలు చేయడమంటే… ఆకాశంపై ఉమ్మేసినట్లే.నీ అవినీతిపై విచారణ జరుగబోతుందనే భయంతోనే ఎదుటి వారిపై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే.కేసీఆర్ పాలనను అంతం చేసే వరకు పోరాడతాం.డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి ఇచ్చే వరకు, ఉద్యోగాల నోటిఫికేషన్, దళిత బంధు ఇచ్చేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం.

LEAVE A RESPONSE