Suryaa.co.in

Telangana

దళిత బంధువు దుర్వినియోగం… బీజేపీ ధ్వజం

సికింద్రాబాద్ నియోజకవర్గంలో దళిత బంధువును అర్హులకు ఇవ్వకుండా trs ప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ సి కె శంకర్ విమర్శించారు.

గురువారం మెట్టుగూడాలో అసెంబ్లీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అధ్యక్షణాలో అసెంబ్లీ ఆఫీస్ బేరస్, డివిజన్ అధ్యక్షుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మేకల సారంగపాణి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో దళిత బంధువు టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేద దళిత బాధితులకు అన్యాయం జరిగితే అసెంబ్లీలో లో దళితులతోని పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కార్యక్రమాలు న్యాయం జరిగే వరకు సామూహిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

వచ్చే నెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి డివిజన్ లో పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు..పాదయాత్ర లో , కాలనీ సంక్షేమ ప్రతినిధులను అపార్ట్మెంట్స్ అధ్యక్షులను, బస్తి ల ప్రముఖులతో అక్కడ ఉన్న సమస్యలపైన పాదయాత్ర ఉంటుందని తెలిపారు.

నెరెడ్ మెట్ కటెస్టడ్ కార్పోరేట్ ప్రసన్న పై టీ ఆర్ ఎస్ గుండాల దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.రాష్ట్రంలో బిజెపి నాయకులపై, కార్యకర్తలపై trs గుండాలు దాడులు చేస్తే సహించేది లేదని తిరిగి భౌతిక దాడులు చేయడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. trs ప్రభుత్వ అవినీతిపై ఉద్యమాలు కొనసాగించాలని అధికార పార్టీ నేతల అక్రమాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చింది.. Trs ప్రభుత్వం లో హిందూలపై దాడులు రానురాను చాలా పెరిగిపోతున్నాయని అన్నారు.

పోలీసులు ఒక్క పార్టీ కె సపోర్ట్ చేస్తూ వారి కింద పని చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే అన్ని హితవు చేశారు…రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో trs పార్టీ కి ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని అన్నారు. బీజేపీ డివిజన్ అధ్యక్షులకు రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.. డివిజన్ల వారిగా యువకులకు క్రికెట్, కబ్బడి, ఖోఖో, క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరస్ రచమల్ల కృష్ణ మూర్తి, ప్రభుగుప్త , వీరన్న, ప్రకాష్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, దిలీప్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రామువర్మ, హనుమత్, రాజేశ్వర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE