– 90 రోజులకు గాను ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
– డిసెంబరు 28న పార్టీ విస్తృత స్థాయి సమావేశం
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
డిసెంబరు 28వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేం అనుకున్న మేరకు ఫలితాలు రానప్పటికీ.. బిజెపి ఓటింగ్ శాతంతో పాటు సీట్లు మెరుగయ్యాయి.భారతీయ జనతా పార్టీకి వందశాతం ఓటింగ్ పెరిగింది. రానున్న పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సంసిద్ధం అయ్యేలా డిసెంబరు 28న పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ , సునిల్ బన్సల్ , బండి సంజయ్ , ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ , రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జులు పాల్గొంటారు.
అదేవిధంగా ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, ఇంచార్జులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, మోర్చాల జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారు. కొంగరకలాన్ లోని శ్లోక ఫంక్షన్ హాల్ లో శ్లోక ఫంక్షన్ హాల్ లో బిజెపి విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 90 రోజులకు గాను ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం.
డిసెంబరు 22, 23న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ పార్లమెంటు ఎన్నికల కార్యచరణ ప్రణాళికపై చర్చించడం జరిగింది. ఇదే సమావేశంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం డిసెంబరు 28న జరపాలని నిర్ణయించడం జరిగింది.
తెలంగాణలో అన్ని వర్గాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికే ఓటు వేస్తామంటూ స్పష్టంగా చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ కి మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాహుల్ గాంధీ సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను.. పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముడిపెట్టి ప్రచారం చేశారు.
యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసిన సవాల్ ను ప్రజలు స్వీకరించి, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, బిజెపికి పట్టం గట్టారు. మధ్యప్రదేశ్ లో నభూతో నభవిష్యతి అనేలా రికార్డ్ స్థాయిలో మెజారిటీని కట్టబెట్టి విజయాన్ని అందించారు. అవినీతిరహిత, కుటుంబ జోక్యం లేని, ప్రజా పరిపాలన దేశంలో మరోసారి రాబోతోంది. ఎవరూ ఊహించిన విధంగా అద్భుతమైన మెజారిటీతో నరేంద్ర మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది.
తెలంగాణలోనూ డబుల్ డిజిట్ తో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత వంద రోజుల్లోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ప్రతి గ్రామంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల, పనితీరు పట్ల సానుకూల మైన స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారే మళ్లీ ప్రధానిగా ఉండాలని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.
అన్ని జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తాం. తెలంగాణలో యువతను ప్రోత్సహిస్తూ.. జనవరి నెలలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకునేలా కార్యచరణ అమలు చేస్తాం. నేడు (డిసెంబరు 26) దేశవ్యాపంగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీర బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్ (9 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (6 ఏళ్లు) ధర్మ రక్షణకోసం మొఘలులతో పోరాటం చేసి బలిదానం అయ్యారు.
మొఘలులతో పోరాటం చేసి గురుగోవింద్ సింగ్ పెద్ద కుమారులు సైతం బలిదానం అయ్యారు. సిక్కుల నుంచి ఇస్లాంలోకి మతం మారాలని ఒత్గిడి చేసి బెదిరింపులకు పాల్పడినా చిన్నారులు ఏమాత్రం తలొగ్గలేదు. తమ ధర్మాన్ని ఎప్పటికీ వదులుకోము. తమ ప్రాణాల కంటే ధర్మమే గొప్పదంటూ, తమ ఊపిరి ఆపివేసినా.. నమ్మిన ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కోసమే నిలబడతామని చాటిచెప్పారు. అయితే, జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ లను ఔరంగజేబు సైన్యం నిర్ధాక్షిణ్యంగా హింసించి సజీవ సమాధి చేసింది. ఆ ఇద్దరు చిన్నారుల త్యాగనిరతిని భావితరానికి చాటిచెప్పేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో డిసెంబరు 26వ తేదీని ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందర ప్రాణప్రతిష్ట మహోత్సవం జరగనుంది. బిజెపి శ్రేణులు, ప్రజలు పూర్తిస్థాయిలో భాగస్వాములై సమాజాన్ని అంతా ఏకం చేయాలి.1990లో నాటి బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం రామరథయాత్ర చేపట్టారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో బీబేపీ శ్రేణులు భాగస్వామ్యం కావాలి. జనవరి 22న దేశంలోని ప్రతి దేవాలయాన్ని అలంకరించి, దేవాలయాల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఆ రోజున ప్రతి హిందువు తమతమ ఇంట్లో దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి.