మార్కులకు ప్రాధాన్యత విద్యా విధానం లోపభూయిష్టం

-తల్లిదండ్రుల తర్వాత గురువులదే
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు

కృష్ణా జిల్లా పామర్రు మండలం శ్రీ అరవిందపురంలో విజ్ఞాన విహార పాఠశాల లో నిర్వహించిన వీరబాల దివస్ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

ఈసందర్భంగా విద్యార్థులు నుద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరం లేనివి, మార్కు లకు ప్రాధాన్యత విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది.వివేకానంద స్వామి. చెప్పిన విషయం ప్రస్తావిస్తూ..విద్య అనేది అనేక రుగ్మతలకు దూరం చేసేది విద్య అటువంటి విద్య ఆత్మ స్థైర్యం ఇస్తుంది. ఆంగ్లేయులు మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ కారణంగా భారత దేశం సంస్కృతి విచ్చిన్నం చేయడానికే . ఇక్కడ కు వచ్చిన తర్వాత నా స్కూల్ రోజులు గుర్తు కు వస్తున్నాయి. తల్లిదండ్రుల తర్వాత గురువు లదే.వీరబాల దివస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.కాశ్మీర్ పండిట్ లు సమస్యలు పై గురుగోవింద్ సింగ్ ఆంగ్లేయులు తో పోరాటం చేశారు. సిక్కుల 10 వ గురువు, గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా జోరవార్ సింగ్, బాబా ఫతే సింగ్ ల ప్రాణ త్యాగనికి గుర్తుగా నేడు వీర్ బల్ దివాస్ జరుపుకుంటున్నాం.

ఔరంగజేబు చేస్తున్న బలవంతపు మత మార్పిడిని ఎదిరించి, ధర్మాన్ని మార్చుకునేది లేదని ధిక్కరించి హిందువులుగా సజీవ సమాధి అయిన, ఈ ఇరువురు బాలల చరిత్ర ప్రాచుర్యంలోకి రాలేదు.

కానీ ప్రధాని నరేంద్రమోదీ గుర్తించి ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 26వ తేదీని వీరబాలదివస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, జిల్లా అధ్యక్షుడు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply