కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకొంటోంది

– కేంద్ర పధకాలకు రాష్ట్ర వాటా చెల్లించడం లేదు
– ఉయ్యూరు బిజెపి బూత్ స్వశక్తీకరణ సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

రాష్ట్రంలో విధ్వంసకర పాలన… మరోవైపు ప్రశ్నిస్తే యట్రాసిటీ కేసు లు అంటూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకొంటోంది.కేంద్ర పధకాలకు రాష్ట్ర వాటా చెల్లించడం లేదు.బిజెపి ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తల మనోభావాలు తెలుసు కునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికే 23 జిల్లాల్లో పూర్తి చేయడం జరిగింది. స్థానికంగా రాజకీయ కోణం కూడా తెలుసు కుంటాం నరేంద్ర మోడీ పాలన ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం.లక్షలాది కోట్లతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతోంది. అయినప్పటికీ సహకారం అందించి డం లేదని అపవాదు వేస్తున్నారు అందువల్ల కేంద్రం నిధులు తో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన చేసి ప్రజల కు వివరిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండా కేంద్ర నిధులు తో 530 కోట్లు తో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ, యోగా, నేచర్ పతి సెంటర్ ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా అభివృద్ధి, 1138కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం, ఒంగోలు.. కత్తి పూడి జాతీయ రహదారి పనులు , ప్రధాన మంత్రి అవాస్ యోజన పధకం ద్వారా ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేశారు. గుడివాడ._మచిలీపట్నం రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుత్ దీకరణ 150కోట్లతో జరుగుతోంది,

పేదలకు సమాధానం చెప్పాలి.ఇంటి నిర్మాణం కు లక్షా50వేలు కేంద్రం ఇస్తే, రాష్ట్ర వాటా 30వేలు ఇవ్వడం లేదు. ఈ జిల్లాలో 3లక్షల మంది కి ఉపాధి హామీ పథకం,పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ 4480 మంది కి ఇవ్వడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు ఏమీ చేసింది. రాష్ట్రంలో రోడ్లు గుంతలు మయం.
రూపాయి న్నర యూనిట్ ఆక్వా కల్చర్ ఇస్తామని ఇవ్వడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ని ప్రజలు ఆశీర్వదించాలి. పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజబాబు, కబర్థి,రామినేని వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply