Suryaa.co.in

Telangana

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టనున్నారు

– తెలంగాణలో బీఅర్ ఎస్ మునిపోయిన పడవ
– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించిన అమిత్ షా. బీ అర్ ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచింది. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీ దే. బీ అర్ ఎస్, కేసిఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారు. అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. కేసిఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచింది.బీ అర్ ఎస్ నాయకుల సంపద పెంచుకున్నారు.

లోపాలు సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతాం. తెలంగాణ లో బీ అర్ ఎస్ మునిపోయిన పడవ.. కాంగ్రెస్ మునగబోయే పడవ .. కమలం మాత్రమే వికసిస్తుంది అని భరోసా ఇచ్చిన అమిత్ షా. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకోలేక పోయింది. స్థానిక అంశాలకు ప్రభావితమై అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారు.కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి పట్టం కట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి.

LEAVE A RESPONSE