రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలి

-రాంగోపాల్ వర్మ అస్లీల పోస్టర్ల దహనం
– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ

“రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై నాలుగున్నరేళ్లుగా జరిగిన దాడులు పైన టిడిపి జనసేన అధినేతలకు ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని డిజిపి సమాజానికి చేటు చేసే చీడపురుగైన రాంగోపాల్ వర్మకు ఎలా ఇచ్చారు అని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు.”

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలకు ఖండిస్తూ కుట్రపూరితంగా వైకాపాకు అనుకూలంగా ప్రతిపక్షాలను కించ పరిచే విదంగా తీస్తున్న సినిమాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల నాయకులు,మీడియా యాజమాన్యాల పైన అక్రమ కేసులు పెట్టాలని కుట్ర పన్నడం పైన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండవేసి అరండేల్ పెట్ టిడిపి కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ఊరేగించి రాంగోపాల్ వర్మ అస్లీల పోస్టర్లు దహనం చేశారు.

ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించ పరిచే వ్యూహం చిత్రంలో సన్నివేశాలుంటే సినిమాను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరిచారు. ఒక సినిమా దర్శకుడుగా సమాజానికి ఉపయోగ పడే విధంగా సినిమాలు తెయలే గాని వ్యక్తిగత స్వలాభంకోసం వైకాపా పార్టీకు ముఖ్యమంత్రి జగన్ అడుగులకి మడుగులు వత్తేలా ఏకపక్షంగా వ్యవహరిస్తే పౌర సమాజం చూస్తా ఊరుకోదని తప్పకుండా సరైన సమాధానంతో బుద్ది చెప్తారన్నారు.

రాష్ట్రంలో గడచిన నాలుగున్నరేళ్లుగా జరిగిన హింసాకాండ ,దారుణాలు హత్యలు మానభంగాల పైన ఫిర్యాదు చేయడానికి ఏరోజు నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజాసంఘాలు అప్పోయింట్మెంట్ ఇవ్వని డిజిపి గారు డర్టీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారికి ఎలా సమయం ఇచ్చారు. ప్రజాశాంతి కంటే అస్లీల భూతు సాహిత్యాన్ని ప్రోత్సహించే రాంగోపాల్ వర్మకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ప్రజానీకం అడుగుతుంది.

తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలు వెళుతుండటంతో భయపడిపోయిన జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ పిలిపించి కులాల మధ్య విద్వేషం నింపే విధంగా జనసేన టిడిపి కూటమి విడిపోయే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను కించపరిచే విధంగా సినిమాను తీయడంతో దానిని బ్యాన్ చేయాలంటూ యువ నాయకుడు నారా లోకేష్ గారు కోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే.

దీంతో తట్టుకోలేక నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టాడు దీనిపై జరుగుతున్న చర్చలో ప్రముఖ టీవీ ఛానల్ లో రామ్ గోపాల్ వర్మను విమర్శించడంతో అతను మరింతరించిపోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లను విమర్శించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టర్,జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్ రావు, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, అధికార ప్రతినిధి షేక్ షుకూర్,కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాస్ రావు, కార్యదర్సులు మాచవరపు దాసు, గుంటూరు తూర్పు తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మస్తాన్ రావ్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు, గుంటూరు పశ్చిమ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, 48వ డివిజన్ టీడీపి అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు,టిడిపి నాయకులు షేక్ సుభానీ,కొల్లా నాగుల్,నిమ్మగడ్డ రమేష్ ,తెలుగుయువత నాయకులు చిక్కాల శివరామ కృష్ణ,శొంఠినేని అనిల్, బుల్లా కుమార్ బాబు,శేషాద్రి సాంబశివరావు,సింగు నాగమల్లేశ్వరావు,చింతా వినోద్, ఉపేంద్ర తథితరులు పెద్దసంఖ్యలో పాల్గున్నారు.

Leave a Reply