– మీరు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించి రండి
– 2022 లో సుప్రీంకోర్టులో ఎందుకు అఫిడవిట్ ఇచ్చారు
– సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిటర్ కాంగ్రెస్ పార్టీ
– తెలంగాణ భవన్ లో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారితో సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్ర సందర్భంగా అసమానతలు గమనించిన జన గణన లో కులగణన జరగాలని చెప్పారు. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కుల గణన చేపట్టాం.
సైద్ధాంతికంగా ,న్యాయపరంగా అన్ని రకాల అంశాలను అధిగమించి ప్రశ్నావళి తయారు చేసి అనేక మంది అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. బీసీ కమిషన్ సూచన మేరకు ఈ కులగణన జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా కులగణలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన సమాచారం 80 కోట్ల పేపర్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి
దానిని కంప్యూటరీకరణ చేసుకుని సమాచారాన్ని భద్రపరుచుకొని సబ్ కమిటీ పరిశీలించి కేబినెట్ కి పంపింది. కేబినెట్ ఆమోదం తరువాత ఫిబ్రవరి 4,2025 న దానిని చట్టం చేయడం జరిగింది. బీసీ లకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపాం. ఫిబ్రవరి లో గవర్నర్ దగ్గరకు పంపిన బిల్లు ఏప్రిల్ 30 నాడు న్యాయ సలహా తరువాత రాష్ట్రపతి దగ్గరకు పంపారు. ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది.
నిన్న ఢిల్లీకి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు,ముగ్గురు బలహీన వర్గాల మంత్రులం ఎక్స్పర్ట్ కమిటీ ఖర్గే ,రాహుల్ గాంధీ లతో సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు ,ఎంపీలు ఎఐసిసి నాయకులు ఖర్గే ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లతో సమావేశమైనప్పుడు ఇది దేశ వ్యాప్తంగా జరగాల్సిందే అని చెప్పారు. దీనిలో మేము ఏ రాజకీయ పార్టీలను నిందించడం లేదు. తెలంగాణ శాసన సభ లో బీజేపీ తో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. బిల్లు ఏకగ్రీవం అయింది.
కిషన్ రెడ్డి మాటలు ఐక్యంగా ముక్తకంఠం తో ఖండిస్తున్నాం. మీది ఫ్యూడలిస్ట్ పార్టీ. ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల కమిషన్ తీసుకువచ్చి దానిని నీరుగార్చేందుకు కమండల తీసుకొచ్చారు. మీది రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ. పెత్తందారులకు తప్ప బలహీన వర్గాలకు న్యాయం చేయాలని లేదు.
తెలంగాణకు బీజేపీ బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు. కనీసం ప్రతిపక్ష నాయకుడుని కూడా బీసీకి ఇవ్వలేదు. బండి సంజయ్ బీసీ పార్టీ అధ్యక్షుడిగా ఉండే. ఆకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులు అయ్యారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆనాడు నవ సంఘర్షణ సమితి, మురళీధర్ రావు కమిషన్ మండల కమిషన్ వచ్చి, నాడు పోరాటాలు చేసి బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రామచంద్రరావును తీసుకొచ్చి బిజెపి అధ్యక్షుడుని చేశారు.
ఆయన ఒక ఫ్యూడలిస్ట్ సిస్టమ్. ఆయన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా వస్తాయి అంటారు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు బీఆర్ఎస్ తో కుమ్మకై గెలుస్తున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొమ్మని. తెలంగాణ బలహీన వర్గాల అంశానికి సంబంధించిన అంశం బలహీన వర్గాలకు లాభం జరగాలి.
మీరు ఇలా వ్యతిరేకిస్తే మా కుల సంఘాలు బలహీన వర్గాల సంఘాలు తెలంగాణ లో మిమ్మల్ని అడుగు కూడా పెట్టనియ్యదు. చాలా సంవత్సరాల తర్వాత బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవకాశం వచ్చింది. వేచిచూసే ధోరణి తో సానుకూల ప్రయత్నం చేస్తున్నాం.
నోటికొచ్చే కూడును బిజెపి తన్నే ప్రయత్నం చేయవద్దు. బీజేపీ లో ఉన్న బీసీ నాయకుల్లారా.. కిషన్ రెడ్డి,రామచంద్రరావు లాంటి బీసీ ల వ్యతిరేక మాటలు వినండి. తెలంగాణ ఉద్యమం లో మా పార్టీలోని మేము కొట్లాడినం. మాది సామాజిక పార్టీ. సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిటర్ మా కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీలో గొంతు విప్పకపోతే అణిచివేత కు గురవుతారు.
బిజెపి బీసీలకు మా కన్నా ఎక్కువ ఏం చేసింది? బీసీల రిజర్వేషన్లు ముస్లింల ప్రస్తావని తీసుకొస్తున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్, మీరు పరిపాలిస్తున్న గుజరాత్ లో రిజర్వేషన్లు తొలగించి రండి. అక్కడ తీయకుండా పొత్తులో ఉండే రాష్ట్రాల్లో మాట్లాడరు. ఇక్కడ బీసీ లకు రిజర్వేషన్లు జరుగుతుంటే ఒక అపోహ సృష్టిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ గా ఏర్పడినట్టు రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అదే విధంగా ముందుకు కదలాలి. రిజర్వేషన్లు పెరిగితే అధికంగా సామాజికంగా రాజకీయంగా ఉద్యోగాలపరంగా విద్యా రంగాల్లో అభివృద్ధి జరిగి విప్లవత్మక మార్పులు జరుగుతాయి. బీజేపీ, బీఆర్ఎస్ ,టిడిపి , ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డలు స్వాగతించండి. మీ పార్టీలు మాకన్నా ఎక్కువ చేసి న్యాయం చేస్తామని కీర్తి తెచ్చుకోండి.
రాజకీయంగా బీసీ లకు వ్యతిరేక విధానాలు మా మీద రుద్ది మాకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదు. మాది సెక్యులర్ పార్టీ. మాకు ఒక ఆలోచన విధానం ఉంది.ఎవరి పక్షం కాదు. ప్రధాన మంత్రి బీసీ అని చెప్పుకునే ఆయన తెలంగాణ లో 9 శాతం లేని వారికి ews రిజర్వేషన్లు ఇచ్చారు. మేము ఏం అన్యాయం చేశాం? 56 శాతం ఉన్న మాకు ఎందుకు ఇన్ని పరీక్షలు.. ఇంత వివక్ష?
2022 లో సుప్రీంకోర్టులో ఎందుకు అఫిడవిట్ ఇచ్చారు? రాహుల్ గాంధీ ఓపెన్ మైండ్ తో ఉన్నారు. మీది కుట్ర బుద్ధి. మాది పేదలు, బడుగు బలహీన వర్గాల మైనార్టీల పట్ల ప్రత్యేక పాలసీ ఉంటుంది.